ETV Bharat / bharat

రికార్డులను తిరగరాసిన కంబళ వీరుడు

author img

By

Published : Mar 29, 2021, 9:27 AM IST

ప్రముఖ కంబళ పోటీదారు శ్రీనివాస గౌడ రికార్డులు తిరగరాశాడు. రేసులో భాగంగా వంద మీటర్ల పరుగును 8.78 సెకన్లలోనే పూర్తి చేశాడు. గతవారం నెలకొల్పిన 8.96 సెకన్ల రికార్డును బద్దలుకొట్టాడు.

Srinivas Gowda sets new record in Kambala racing
కంబళ వీరుడి రికార్డు- వంద మీటర్లు.. 8.78 సెకన్లు

కంబళ వీరుడు శ్రీనివాస గౌడ మరోసారి రికార్డు సృష్టించాడు. 125 మీటర్ల కంబళ రేసును 9.55 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో కేవలం 8.78 సెకన్లలోనే వంద మీటర్ల దూరాన్ని చేరుకున్నాడు. గతవారం తానే నెలకొల్పిన 8.96 సెకన్ల రికార్డును తాజాగా తిరగరాశాడు. 'మైరా సత్య-ధర్మ జోడుకెరే' అనే సంఘం ఈ పోటీలను నిర్వహించింది.

గతవారం దక్షిణ కన్నడ జిల్లాలోని పెర్ముడాలో జరిగిన 'సూర్య-చంద్ర జోడుకేరే కంబళ' పోటీల్లో ఈ రేసుగుర్రం రికార్డు సృష్టించాడు. 100 మీటర్ల పరుగును కేవలం 8.96 సెకండ్లలో పూర్తిచేసి.. అప్పటివరకు ఉన్న రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు ఆ రికార్డును తానే బద్దలుకొట్టాడు.

గతేడాది ఫిబ్రవరిలో కంబళ పోటీని రికార్డు వేగంతో పూర్తి చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస్ గౌడ. బోల్ట్​ను మించిన వేగంతో పరిగెడుతున్నాడని ప్రశంసలు అందుకున్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నుంచి ఘన సత్కారం అందుకున్నాడు.

ఏమిటీ కంబళ?

కంబళ అనేది ప్రధానంగా కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో నిర్వహించే సంప్రదాయబద్ధమైన పరుగు పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరుగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరుగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతూ వాటిని వెంబడిస్తుంటారు.

ఇవీ చదవండి:

9.15 సెకన్లలో 100 మీటర్ల 'కంబళ' పరుగు

బోల్ట్​ను మించిన వేగం.. ఒలింపిక్స్​కు పంపిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.