ETV Bharat / bharat

కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 12 మందికి అస్వస్థత

spurious liquor deaths: కల్తీ మద్యం సేవించి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఆజంగఢ్​ జిల్లాలో వెలుగుచూసింది. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు.

spurious liquor deaths
కల్తీ మద్యం
author img

By

Published : Feb 21, 2022, 5:22 PM IST

spurious liquor deaths: ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం సేవించి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోమారు వెలుగుచూసింది. ఆజంగఢ్​ జిల్లాలోని అహరైలా పోలీస్​ స్టేషన్​ పరిధిలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పలు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆదివారం సాయంత్రం మహుల్​ నగర పంచాయతీలో కల్తీ మద్యం విక్రయించినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మహుల్​లో ఆందోళనకు దిగారు. ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కల్తీ మద్యం విక్రయాలు పెరిగాయని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

అధికారులు కలుగజేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా శాంతించారు.

ఇదీ చూడండి: రూ.17లక్షల బంగారం బ్యాగ్ మాయం.. గంటల్లోనే కనిపెట్టిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.