ఐఐటీ మద్రాస్‌లో డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు 66 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో క్యాంపస్‌లో అకడమిక్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇన్స్టిట్యూట్లో అన్ని విభాగాలు, పరిశోధనా కేంద్రాలు, గ్రంథాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు బయటకు రావద్దని, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇంటినుంచే విధులు నిర్వహించాలని నిర్దేశించారు.
ప్రస్తుతం కేవలం 10శాతం మంది విద్యార్థులు ఉన్న ఐఐటీ మద్రాస్ హాస్టళ్లలో.. ఇటీవల కొంతమందికి కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. అధికారులు అప్రమత్తమై... అందరికీ కరోనా పరీక్షలు చేయించారు.
ఇదీ చదవండి : రాజస్థాన్‌లోని కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం