ETV Bharat / bharat

అధికారి ఇంటిపై ఉగ్రవాదుల కాల్పులు.. ముగ్గురు మృతి - terrorists attack on police officials family

జమ్ముకశ్మీర్‌లోని ప్రత్యేక పోలీసు అధికారి కుటుంబంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అధికారి సహా ఆయన భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తం అయిన భద్రతాదళాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి.

terrorists attack on police officials family
అధికారిపై ఉగ్రవాదుల కాల్పులు
author img

By

Published : Jun 28, 2021, 1:24 AM IST

Updated : Jun 28, 2021, 12:06 PM IST

జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని హరిపరిగామ్​లో ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్​పీఓ) ఫయాజ్​ అహ్మద్​ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్​పీఓ ఫయాజ్‌ అహ్మద్ ఇంట్లోకి ముష్కరులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎస్​పీఓ అహ్మద్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రాజాబేగం, కుమార్తె రఫియా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి.

అధికారులు.. ఫయాజ్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యుల భౌతికకాయాలకు మత సంప్రదాయాలను అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు వందలాది మంది స్థానికులు హాజరై.. ఫయాజ్‌ కుటుంబ సభ్యులకు నివాళులర్పించారు.

ఎస్పీవో కుటుంబంపై ముష్కరుల దాడిని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, భాజపా అధికార ప్రతినిథి అల్తాఫ్ ఠాకూర్‌ సహా పలు పార్టీల నేతలు ఖండించారు.

ఇదీ చూడండి: కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతి

Last Updated : Jun 28, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.