ETV Bharat / bharat

నదిపై గ్రంథాలయం.. సరికొత్తగా పుస్తక పఠనం - కోల్​కతా ఫ్లోటింగ్​ లైబ్రరీ వార్త

పుస్తక ప్రేమికుల కోసం బంగాల్​ ప్రజా రవాణా సంస్థ వినూత్నంగా ఆలోచించింది. ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూనే పుస్తక పఠనం చేసేలా బోట్​ లైబ్రరీతో ప్రత్యేక ఏర్పాటు చేసింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరికీ పఠనాసక్తిని పెంచేందుకు ఇలా చేశామని చెబుతోంది.

special floating library arranged for book readers in Kolkatha
చదువరులకు ప్రత్యేకం.. ఈ ఫ్లోటింగ్​ లైబ్రరీ
author img

By

Published : Jan 30, 2021, 12:29 PM IST

పాఠకులకు ప్రత్యేకం ఈ ఫ్లోటింగ్ లైబ్రరీ

పుస్తక ప్రేమికుల కోసం ఏదైనా చేయాలని ఆలోచించిన బంగాల్​ ప్రజా రవాణా శాఖ ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. అందరూ చదువుకునేలా ఓ ప్రత్యేకమైన గ్రంథాలయం ఏర్పాటు చేసింది. లైబ్రరీ ఏర్పాటు చేయడంలో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ గ్రంథాలయం మామూలుగా ఓ స్థలాన్ని ఎంచుకుని ఏర్పాటు చేసింది కాదు. ప్రత్యేకమైన బోటులో దీన్ని ఏర్పాటు చేయడం విశేషం.

విభిన్న పుస్తకాలున్న ఈ ఫ్లోటింగ్​ లైబ్రరీలో సాహిత్యానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని డబ్ల్యూబీటీసీ యాజమాన్యం పేర్కొంది. జనవరి 28 నుంచి ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.

"ఇక్కడ అనేక రకాల పుస్తకాలున్నాయి. కేవలం పిల్లల కోసమే దీన్ని ఏర్పాటు చేయలేదు. పెద్దవాళ్లు కూడా ఇందులో పుస్తకాలు చదవొచ్చు. చదవాలనే ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ లైబ్రరీలోకి ఆహ్వానితులే. వాళ్లు చిన్నారులైతే ఏంటి? పెద్దవాళ్లయితే ఏంటి?. ఈ బోటులో చదువుకునేందుకు పెద్దలకు రూ. 100, చిన్నారులకు రూ. 50 ఛార్జి తీసుకుంటున్నాం".

- స్వర్ణకమల్ సాహా, డబ్ల్యూబీటీసీ డిప్యూటీ ఛైర్మన్.

ప్రస్తుతం ఈ బోటు లైబ్రరీలో 500 పుస్తకాలున్నాయి. రానున్న రోజుల్లో మరో 500 పుస్తకాలు ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. హూగ్లీ నది ప్రవాహాన్ని ఆనందిస్తూ, ప్రకృతి అందాలను తిలకిస్తూ పర్యటకులు పుస్తకాలు చదువుకోవచ్చని డబ్ల్యూబీటీసీ తెలిపింది. అపీజయ్​ ఆనంద్​ చిల్డ్రన్స్​ లైబ్రరీతో కలిసి ఈ ఫ్లోటింగ్​ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ 'కోల్​కతా యంగ్​ రీడర్స్​ బోట్​ లైబ్రరీ' ఏర్పాటుపై స్థానికులు, పిల్లలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

young readers boating library
యంగ్​ రీడర్స్​ బోటింగ్​ లైబ్రరీ

"కరోనా నేపథ్యంలో పార్కులు, లైబ్రరీలు మూసివేశారు. ఈ తరుణంలో పిల్లలకు చదువుకునేందుకు మంచి ప్రదేశం ఎక్కడా లేదు. నచ్చిన పుస్తకాలు చదువేందుకు ఈ బోట్​ లైబ్రరీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడికి మళ్లీ రావాలని ఆశిస్తున్నాను. కానీ, పాఠశాలలు ఇతర పనుల దృష్ట్యా ఇక్కడికి తరుచుగా రాలేకపోవచ్చు."

- రితోజా దాస్, చిన్నారి.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బోట్​ లైబ్రరీని సోమవారం నుంచి శుక్రవారం వరకే తెరవనున్నట్లు ప్రజా రవాణా శాఖ​ తెలిపింది. రోజులో మూడు ట్రిప్స్​ మాత్రమే ఉంటాయని వివరించింది. ఉచిత వైఫై ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం పాఠకులకు ఏదైనా పుస్తకం నచ్చితే అది కొనుక్కునే సదుపాయం ఇందులో లేదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:యూపీలో కిసాన్​ మహాపంచాయత్​- వేల మంది హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.