ETV Bharat / bharat

యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్! - ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ కూల్చివేత

SP MLA Petrol Pump demolished: ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యేకు గట్టి షాక్ తగిలింది. అక్రమంగా నిర్మించారంటూ ఆయనకు చెందిన పెట్రోల్ బంక్​ను అధికారులు బుల్​డోజర్​తో కూల్చేశారు.

sp-mla-shahjil-islam-petrol-pump-was-demolished-by-bareilly-development-authority
యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్!
author img

By

Published : Apr 7, 2022, 5:53 PM IST

యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్!

SP MLA Shahjil Islam: ఉత్తర్​ప్రదేశ్​లో బుల్​డోజర్​ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అత్యాచారం, ఇతర కేసుల్లో నిందితుల ఆస్తులపై బుల్​డోజర్​ ప్రతాపం చూపించగా.. ఈసారి ఆ జాబితాలో ఏకంగా ఓ శాసనసభ్యుడు చేరారు. సమాజ్​వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ అన్సారీకి చెందిన పెట్రోల్​ బంక్​ను అధికారులు గురువారం కూల్చేశారు. బరేలీ-దిల్లీ జాతీయ రహదారిపై పర్సాఖేడా వద్ద ఉన్న బంక్​ను అక్రమంగా నిర్మించారన్నది వారి వాదన. ఇదే విషయంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చినా స్పందన లేదని.. అందుకే ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పారు బరేలీ అభివృద్ధి ప్రాధికార సంస్థ(బీడీఏ) వైస్ ఛైర్మన్ జోగేంద్ర సింగ్.

sp-mla-shahjil-islam-petrol-pump-was-demolished-by-bareilly-development-authority
యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'- పెట్రోల్ బంక్ ఫసక్!

వారం క్రితం మొదలు: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్సారీపై వారం క్రితమే బరేలీ బరాదరి ఠాణాలో కేసు నమోదైంది. గత శుక్రవారం సొంత నియోజకవర్గం భోజిపురాలో ఓ సభలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అన్సారీ. "ఇటీవల ఎన్నికల తర్వాత ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభలో మన పార్టీ(ఎస్పీ) బలం పెరిగింది. ఆదిత్యనాథ్ ఇకపై ఏదైనా చప్పుడు చేస్తే ఎస్పీ తుపాకుల నుంచి పొగ రాదు.. తూటాలు దూసుకొస్తాయి" అని అన్నారు అన్సారీ. హిందూ యువ వాహిని సభ్యుడి ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా మరికొందరు ఎస్పీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించడం, శాంతిభద్రతలు విఘాతం కలిగించడం, అల్లర్లు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు పెట్టారు.

అబ్బే.. నేను అలా అనలేదు: తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో వివరణ ఇచ్చారు అన్సారీ. తన మాటలను ఓ న్యూస్ ఛానల్ వక్రీకరించిందని చెప్పారు. "తూటాలు దూసుకొస్తాయి అని అననే అనలేదు. తుపాకుల నుంచి బులెట్లు వస్తాయి. పొగ కాదు. అదే తరహాలో మేము కూడా అసెంబ్లీలో యోగికి దీటైన జవాబు ఇస్తాం" అని మాత్రమే తాను అన్నానని స్పష్టం చేశారు అన్సారీ. ఇదంతా జరిగిన కొద్దిరోజులకే అన్సారీ పెట్రోల్​ బంక్​ను కూల్చివేయడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై సమాజ్​వాదీ పార్టీ ఇంకా స్పందించలేదు. ఎమ్మెల్యే అన్సారీని సంప్రదించగా.. "నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇప్పుడేమీ మాట్లాడలేను" అని అన్నారు.

యోగికి వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేకు 'బుల్​డోజర్ దెబ్బ'

ఇదీ చదవండి: రూ.12వేల కోసం కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.