ETV Bharat / bharat

మమతను పరామర్శించనున్న గంగూలీ - bengal elections

ఎన్నికల ప్రచారం సందర్భంగా గాయపడ్డ బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పరామర్శించనున్నారు. అయితే ఎప్పుడు పరామర్శిస్తారన్న విషయంపై స్పష్టత లేదు. సీఎం ప్రస్తుతం ఎస్​ఎస్​కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ganguly
మమతను పరామర్శించనున్న గంగూలీ!
author img

By

Published : Mar 12, 2021, 5:50 AM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని.. మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని గంగూలీ గురువారం వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఎంను పరామర్శిస్తానని చెప్పిన దాదా.. ఎప్పుడు ఆమెను కలుస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నందిగ్రామ్​లో మమత పర్యటిస్తున్న సమయంలో ఆమె గాయపడ్డారు. దీదీ ప్రస్తుతం ఎస్​ఎస్​కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే గవర్నర్​ సహా పలువురు నేతలు మమతను పరామర్శించారు.

ఇదివరకు గంగూలీ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినప్పుడు మమత దాదాను పరామర్శించడం గమనార్హం. గంగూలీ భాజపాలో చేరనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. పరామర్శించేందుకు వెళ్తానని దాదా చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి : దీదీకి పోటీగా 'దాదా'!- మాటల మర్మం ఇదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.