ETV Bharat / bharat

సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు- రూ.12లక్షలు జరిమానా! - saumya vishwanathan story

Soumya Vishwanathan Murder Case : జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు జీవితఖైదు, మరొకరికి మూడేళ్ల శిక్ష విధించింది దిల్లీలోని కోర్టు. దోషులందరికీ కలిపి రూ.12 లక్షలు జరిమానా విధించింది.

Soumya Vishwanathan Murder Case
Soumya Vishwanathan Murder Case
author img

By PTI

Published : Nov 25, 2023, 4:57 PM IST

Updated : Nov 25, 2023, 5:13 PM IST

Soumya Vishwanathan Murder Case : టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు జీవితఖైదు విధించింది దిల్లీలోని ఓ న్యాయస్థానం. ఐదో దోషికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జీవితఖైదు పడ్డ రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్​కు రూ.1.25 లక్షల చొప్పున జరిమానా సైతం విధించారు అడిషనల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే. ఐదో దోషి అజయ్ సేఠీకి రూ.7.25లక్షలు ఫైన్ విధించారు. దోషులు చెల్లించే రూ.12 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ హత్యను అత్యంత అరుదైన ఘటనగా భావించడం లేదని, అందుకే ఉరి శిక్ష విధించడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్​లో పనిచేసే సౌమ్య 2008 సెప్టెంబర్ 30న హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున 3 గంటలకు కారులో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న క్రమంలో దిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్​లో దుండగులు ఆమెను అడ్డగించారు. దోపిడీకి యత్నించి.. ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్‌ చేయగా 2009 మార్చి నుంచి వారు జ్యూడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. అక్టోబర్ 18న నిందితులందరినీ దోషులుగా తేల్చుతూ దిల్లీ కోర్టు తీర్పు ఇచ్చింది.

నాటు తుపాకీతో కాల్పులు..
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. రవి కపూర్ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో సౌమ్యపై కాల్పులు జరిపాడు. అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్.. సౌమ్య స్వామినాథన్​ వెంట ఉన్నారు. రాబరీ కోసం వారు ఉపయోగించిన కారును.. ఐదో నిందితుడు అజయ్ సేఠీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో.. హత్య నేరం కింద నలుగురికి, నేరానికి సహకరించినందున అజయ్ సేథీకి శిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

'సంతృప్తికరం కాదు.. కానీ'
న్యాయం కోసం తాను 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని విచారణ సమయంలో సౌమ్య తల్లి మాధవి విశ్వనాథన్ పేర్కొన్నారు. అయితే, శిక్షపట్ల తాను సంతృప్తిగా లేనని తీర్పు అనంతరం మీడియాతో చెప్పారు. 'నేను సంతృప్తి చందలేదు. కానీ, ఇది మంచికేనని మాత్రం చెప్పగలను. చేసిన పనులకు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందనే సందేశం సమాజానికి ఇచ్చినట్లైంది' అని వ్యాఖ్యానించారు.

  • #WATCH | Delhi: On Saket Court awarding life imprisonment to all four accused involved in 2008 TV journalist Soumya Vishwanathan's murder case, the mother of Soumya Vishwanathan says, "I am not satisfied, but I can say it is a good thing... A message has been given to society… pic.twitter.com/ajGIoUkZZM

    — ANI (@ANI) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Actress Jaya Prada Jail : జయప్రదకు 6నెలల జైలు శిక్ష ఫిక్స్​.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Mothers Right On Deceased Son Property : 'మరణించిన కుమారుడి ఆస్తిలో తల్లికీ వాటా.. ఆమె కూడా వారసురాలే'

Last Updated : Nov 25, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.