ETV Bharat / bharat

సోనాలీ ఫోగాట్​కు ఇచ్చిన డ్రగ్స్​ అవే, లైవ్ సీసీటీవీ ఫుటేజీ లభ్యం

టిక్‌టాక్ నటి, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్‌ హత్య కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆమె హత్యకు సంబంధించిన రెండు సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోనాలీకి ఇచ్చిన డ్రగ్స్​ వివరాలు కూడా తెలిశాయి.

Sonlai Phogat Cctv Video
sonlai phogat cctv video pa sudhir sangwan giving drugs in goa night club
author img

By

Published : Aug 27, 2022, 10:36 PM IST

Sonlai Phogat Cctv Video: టిక్‌టాక్ నటి, భాజపా నాయకురాలు సోనాలీ ఫోగాట్‌(42) అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఆమె అద్దెకు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్‌ పత్రాల్లో సోనాలీ పేరు.. ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్‌ సంగ్వాన్‌ భార్యగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 102లో ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను సోనాలీ అద్దెకు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాల్లో సోనాలీ పేరు తన పర్సనల్ అసిస్టెంట్‌ అయిన సుధీర్‌ సంగ్వాన్‌ భార్యగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ అపార్ట్‌మెంట్‌కు సోనాలీ తరచూ వచ్చేవారు. గోవాకు వెళ్లే ముందు కూడా ఆమె తన సహాయకుడితో కలిసి ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, ఈ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసు వెరిఫికేషన్‌ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

గోవా క్లబ్‌ యజమాని, డ్రగ్‌ డీలర్‌ అరెస్టు..
గోవా పర్యటనకు వెళ్లిన సోనాలీ ఫోగాట్‌ గత సోమవారం అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మొదట గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తర గోవాలో ఆమె బస చేసిన క్లబ్‌లో జరిగిన పార్టీలో సోనాలీ తాగే డ్రింక్‌లో హానికరమైన పదార్థాలు కలిపారని, అదే ఆమె మరణానికి దారితీసిందని గోవా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో సోనాలీ సహాయకులైన సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్వీందర్‌ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు. వీరిని నేడు కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.

మరోవైపు, చనిపోవడానికి ముందు సోనాలీ పార్టీకి వెళ్లిన క్లబ్‌ యజమాని, డ్రగ్‌ డీలర్‌ దత్తప్రసాద్‌ గోయంకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోయంకర్‌ నుంచి తాము డ్రగ్స్‌ తీసుకున్నట్లు సోనాలీ సహాయకులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ డ్రింక్‌ను వారే బలవంతంగా సోనాలీతో తాగించినట్లు కూడా నిందితులు ఒప్పుకున్నారు. అయితే ఈ 'హత్య'కు దారితీసిన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

బయటపడిన మరో సీసీటీవీ దృశ్యం..
భాజపా నేత, నటి సోనాలీ ఫొగట్​ హత్య కేసులో మరో రెండు సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. రెండు వీడియోలు ఆమె చనిపోయే రోజు బసచేసిన హొటల్​ లోనివే. ఓ వీడియోలో సుధీర్​ సంగ్వాన్​, సుఖ్​విందర్​ సోనాలీకి బలవంతంగా డ్రింక్ తాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి సోనాలీకి ఏవో తాగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తర్వాత చిన్న కుదుపు వల్ల బయటకు కక్కడం వీడియోలో కనిపిస్తోంది. మరో వీడియోలో సుధీర్​ సంగ్వాన్​, సుఖ్​విందర్ ఆమెను బయటకు తీసుకెళ్తున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు ఆమె పడిపోయేది.. అయినా ఆగకుండా తీసుకెళ్లారు. అయితే డ్రింక్​ తాగే వరకు సోనాలీ మామూలుగానే డాన్స్​ చేసింది. డ్రింక్ తాగించిన తర్వాత పడిపోవడం మొదలుపెట్టింది.

సోనాలీ ఫోగాట్​కు డ్రింక్​ తాగిస్తున్న దృశ్యం

సోనాలికి ఇచ్చిన డ్రగ్స్ ఇవే..
సోనాలీ ఫోగాట్​కి ఇచ్చింది మెథాంఫేటమిన్​ డ్రగ్స్​ అని గోవా పోలీసులు వెల్లడించారు. ఆ డ్రగ్స్​ని రెస్టారెంట్​ వాష్​రూప్​ నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. ఈ మేరకు సోనాలీ కుటుంబ సభ్యులను కలిసిన ఆయన.. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మాజీ టిక్‌టాక్‌ స్టార్‌గా, 'బిగ్‌బాస్‌' టీవీ రియాలిటీ షో ద్వారా ప్రాచుర్యం పొందారు సోనాలీ ఫోగాట్‌. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేశారు. అయితే ఆ ఎన్నికలో ఆమె ఓడిపోయారు. ఆమె భర్త కొన్నేళ్ల కిందటే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె ఉంది.

ఇవీ చదవండి: ఆజాద్​ రాజకీయ ప్రస్థానం, విధేయుడిగా మొదలై తిరుగుబాటుదారుడిగా

పొట్టలో 44 డ్రగ్​ క్యాప్సుల్స్​, కడుపునొప్పితో ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా చిక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.