దేశంలో పెరిగిపోతున్న ధరలు(price rise in india), ద్రవ్యోల్బణానికి(inflation news) వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధమైంది కాంగ్రెస్(Congress news). పెరుగుతున్న ధరలను నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు డిసెంబర్ 12న దిల్లీలో భారీ బహిరంగ సభ(congress rally against inflation) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ర్యాలీలో భాగంగా ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Congress president Sonia Gandhi), రాహుల్ గాంధీ మాట్లాడతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
"డిసెంబర్ 12న దిల్లీలో నిర్వహించే భారీ ర్యాలీ ద్వారా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలు ఈ ర్యాలీలో మాట్లాడతారు. ఈ సభ ద్వారా వెన్ను విరుస్తోన్న ధరలను తగ్గించాలని, ప్రజలను దోచుకోవటం అపాలని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయనున్నాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు మా ఆందోళనలు కొనసాగుతాయి. మోదీ, ద్రవ్యోల్బణం ప్రజలకు శాపంగా మారాయి. దేశంలోని ప్రతి కుటుంబ బడ్జెట్ను ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తారుమారు చేసింది."
- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.
ప్రజలు పడుతున్న బాధలను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత(Congress news). కొన్ని మీడియాల బలంతో మతాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. దాని ద్వారా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోందని గుర్తు చేశారు.
విపక్షాల భేటీకి కాంగ్రెస్ పిలుపు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల(parliament winter sessions) ప్రారంభం రోజున వివిధ పార్టీలకు చెందిన విపక్ష నేతలు దిల్లీలో సమావేశం కానున్నారు. పార్లమెంట్లో ఏకతాటిపై ఉండటం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లేఖ రాశారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. ఈనెల 29న ఉదయం 9.45 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరారు. కీలకమైన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తేందుకు ఈ భేటీ ఉపయోగపడుతుందని సూచించారు. వర్షకాల సమావేశాల్లో మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
విప్ జారీ చేసిన కాంగ్రెస్
ఈనెల 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు(parliament winter session 2021) ప్రారంభమవుతున్న క్రమంలో తొలిరోజు ఉభయ సభలకు తప్పనిసరిగా హాజరు కావాలని తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది కాంగ్రెస్. అదే రోజు సాగు చట్టాల రద్దు బిల్లు సభల ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: కనీస మద్దతు ధరపై చట్టం తేవాల్సిందే: టికాయిత్