కాంగ్రెస్‌లో సంస్థాగతంగా సమూల మార్పులు తీసుకురావాలంటూ లేఖాస్త్రాన్ని సంధించిన సీనియర్ నేతల్లోని కొందరితో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో సోనియా వీరితో భేటీ కానున్నారు. వీరిలో రాజ్యసభ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ కూడా ఉంటారు.
ఆ రెండు రోజుల్లో పలువురు సీనియర్ నేతలతో వరుస భేటీలను సోనియా నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీకి సంబంధించి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నాయి.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించరాదన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో పొత్తులపై కూడా సోనియా చర్చిస్తారని వెల్లడించాయి.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!