ETV Bharat / bharat

Sonia: 'ప్రజలు టీకా తీసుకునేలా ప్రోత్సహించాలి' - కాంగ్రెస్​ అధ్యక్షురాలు

దేశ ప్రజలు టీకా తీసుకునేలా వారిలోని అపోహలను తొలగించేందుకు పార్టీ సభ్యులు పని చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో వర్చువల్​గా భేటీ అయ్యారు.

Sonia Gandhi
సోనియా గాంధీ
author img

By

Published : Jun 24, 2021, 12:52 PM IST

భారత్​లో చేపడుతోన్న వ్యాక్సినేషన్​ విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనయా గాంధీ. చిన్నారులను రక్షించేందుకు, కొవిడ్​-19 మూడో దశ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు దేశం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులతో వర్చువల్​గా సమావేశమయ్యారు సోనియా గాంధీ. వ్యాక్సిన్​పై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తగ్గించటం, టీకాల వృథాని తగ్గించేందుకు పార్టీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

" రోజువారీ వ్యాక్సిన్​ డోసుల పంపిణీని మూడురేట్లుకు పెంచితేనే.. ఈ ఏడాది చివరి నాటికి 75 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్​ పూర్తవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఇది పూర్తిగా టీకా సరఫరా సమర్థతపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూనే ఉండాలి. అదే సమయంలో.. టీకాల రిజిస్ట్రేషన్లు పెంచటం, ఎక్కడైతే వ్యాక్సిన్​ తీసుకునేందుకు వెనకాడుతున్నారో ఆ సమస్యను పరిష్కరించటం, టీకాల వృథాను తగ్గించటం చేయాలి. "

- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

ఇదీ చూడండి: 'మోదీ'పై వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టుకు రాహుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.