ETV Bharat / bharat

కన్నతల్లిని సూదితో పొడిచి హత్య.. స్వయంగా పోలీసులకు ఫోన్ చేసిన కొడుకు - తండ్రిపై కొడుకు దాడి

Son Killed Mother : దిల్లీలో కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు ఓ కొడుకు. సూదితో పలుమార్లు పొడవడం వల్ల ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడే పోలీసులకు సమాచారం అందించాడు. రోహిణి జిల్లాలో ఘటన జరిగింది. మరోవైపు కన్నతండ్రిపై కత్తితో కొడుకు దాడి చేసిన ఘటన బిహార్​లో జరిగింది.

son-killed-mother-in-delhi-with-needle
దిల్లీలో వృద్ధ తల్లిని చంపిన కొడుకు
author img

By

Published : Jul 8, 2023, 8:49 AM IST

Son Killed Mother : కన్న తల్లిని సూదితో పలుమార్లు పొడిచాడు ఓ కొడుకు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్​ చేసి.. ఘటనపై సమాచారం అందించాడు. దిల్లీలోని రోహిణి జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుడు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నతల్లినే హత్య చేసిన నిందితుడి పేరు రింకూ(38). అతడు గత కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. అందుకు చికిత్స కూడా పొందుతున్నాడు. శుక్రవారం తల్లి సత్వంత్ కౌర్(64)​ను దారుణంగా హత్య చేశాడు రింకూ. అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వయంగా పోలీసులకు ఫోన్​ చేసి చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సత్వంత్ కౌర్ చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధరించారు. అనంతరం మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించారు.

మృతురాలు ఓ రిటైర్డ్​ టీచర్​ అని దిల్లీ పోలీసులు తెలిపారు. ఈమె కేఎన్​ కట్జు పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. కొడుకుతో కలిసి నివాసం ఉంటుందని వెల్లడించారు. సత్వంత్ కౌర్ భర్త ప్రీతమ్​ కొంత కాలం క్రితం చనిపోయాడని వారు వివరించారు. శుక్రవారం సాయంత్రం తమకు పీసీఆర్ కాల్​ అందిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని.. అతడిపై కేసు నమోదు చేశామని వారు వెల్లడించారు. రింకూ బీటెక్​ పూర్తి చేశాడని తెలిపిన పోలీసులు.. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. కాగా కొడుకే తల్లిని చంపడం.. స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు..
Son Attack On Father : మందలించాడని తండ్రిపై కత్తితో దాడి చేశాడు ఓ కొడుకు. కుళ్లిన ఆలుగడ్డలు కొనుకొచ్చావన్నందుకు.. ఈ దారుణానికి తెగబడ్డాడు. బిహార్​లోని రోహ్తాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితుడు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపురి పరిధిలోని బస్తీపుర్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దశరథ్ చంద్రవంశీ.. తన కొడుకు కల్లూ(25)ను.. కూరగాయాలు తీసుకురమ్మని స్థానిక మార్కెట్​కు పంపించాడు. అయితే.. కుళ్లిపోయిన ఆలుగడ్డలు తీసుకువచ్చాడు కల్లూ. దీంతో కొడుకును మందలించాడు తండ్రి. దాంతో తీవ్ర ఆగ్రాహానికి గురైన కొడుకు.. దశరథ్​పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం దశరథ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.