కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారికి 'నేనున్నాను' అంటూ సాయం చేస్తూ ఎన్నోసార్లు గొప్ప మనసు చాటుకున్నారు నటుడు సోనూసూద్. తెరపై విలన్‌గా మెప్పించినప్పటికీ.. ప్రజలు ఆయనను 'రియల్ హీరో' అని పిలుచుకుంటున్నారు. అలాంటి సోనూసూద్‌పై తనకు ఉన్న అభిమానాన్ని మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి విభిన్నంగా చాటుకున్నాడు. సోనూ బొమ్మను 10 అడుగుల గోడపై పెయింట్ చేశాడు.
సరాఫా ప్రాంతంలో నివసించే సోమిన్ అనే యువకుడు ఈ పెయింటింగ్‌ను వేశాడు. 8 రోజులపాటు శ్రమించి అతడు దీన్ని పూర్తి చేశాడు. అనంతరం మే 22న దాన్ని అతడు ట్విట్టర్లో సోనూసూద్‌కు ట్యాగ్ చేస్తూ షేర్ చేశాడు. ఆ ట్వీట్‌ను చూసి సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు. జబల్‌పుర్‌కు విచ్చేసి తాను సోమిన్ను కలుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు సోనూ రాక కోసం సోమిన్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను కూడా గోడపై పెయింట్ చేశాడు సోమిన్.
ఇదీ చూడండి: 'ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు'
ఇదీ చూడండి: వరి కనీస మద్దతు ధర పెంపు