ETV Bharat / bharat

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి - జమ్ము కశ్మీర్​లో దారుణం

soldier killed in Kokernag: జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ముష్కరులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అనంతనాగ్ జిల్లాలో జరిగింది.

soldier killed in Kokernag
జమ్ము కశ్మీర్​లో జవాన్ మృతి
author img

By

Published : Apr 16, 2022, 5:42 PM IST

Updated : Apr 16, 2022, 6:03 PM IST

soldier killed in Kokernag: జమ్ము కశ్మీర్​లో ఎన్​కౌంటర్ జరిగింది. దక్షిణ కశ్మీర్​లోని అనంతనాగ్​ జిల్లా కోకెర్​నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదల, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మరణించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఇరువర్గాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

కాల్పుల్లో నషీన్ అనే సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు కావడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. అనంతనాగ్​లోని కోకెర్​నాగ్​ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. అప్పుడు ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో జవాన్​ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఉగ్రసంస్థ అల్​ఖైదాతో సంబంధమున్న ఆరుగురు అనుమానితులని శనివారం అదుపులోకి తీసుకున్నారు అసోం పోలీసులు. వీరందరికీ అల్​ఖైదా సభ్యుడైన సైఫుల్‌ ఇస్లాం అలియాస్‌ హరున్‌ రషీద్‌తో ప్రత్యక్ష సంబంధాలున్నట్లు గుర్తించామని తెలిపారు. మార్చి 4న అరెస్టయిన ఓ ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆర్​ఎస్​ఎస్​ నాయకుడు దారుణ హత్య.. బైక్​పై వచ్చి నరికి..

Last Updated : Apr 16, 2022, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.