ETV Bharat / bharat

జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం - జమ్ము-శ్రీనగర్ రహదారి మూసివేత

హిమపాతం, పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్ములో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా మంగళవారం జమ్ము- శ్రీనగర్​ జాతీయ రహదారిని మూసివేశారు.

Snowfall landslides shut J-K highway, 300 vehicles stranded
జమ్ములో భారీ హిమపాతం-రాకపోకలకు అంతరాయం
author img

By

Published : Mar 23, 2021, 2:18 PM IST

జవహర్ టన్నెల్ ప్రాంతంలో భారీ హిమపాతం, బనిహాల్, ఛందేర్​కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా జమ్ము-శ్రీనగర్​ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. ఫలితంగా దాదాపు 300 వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసాయని అధికారులు స్పష్టం చేశారు.

సోమవారం రాత్రి నుంచే వందల సంఖ్యలో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని, సహాయక చర్యలు చేపట్టి రంబన్​ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించినట్లు ట్రాఫిక్ డీఎస్పీ పరూల్ భరద్వాజ్ పేర్కొన్నారు.

జమ్ములోని రంబన్, దోడ, కిస్తవార్ ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తుందని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. జమ్ములో మంగళవారం 14.9 డిగ్రీ సెల్సియస్​ల ఉష్ణోగ్రత నమోదైందని స్పష్టం చేశారు. సోమవారం ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలుగా ఉందని తెలిపారు.

ఇదీ చదవండి:పొలంలో అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.