మృతిచెందిన పిల్లి గర్భంలో నుంచి పిల్లలను తీసి వాటికి ఆయువు పోశాడు ఓ వ్యక్తి. కేరళలోని త్రిస్సూర్‌లో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది....
హరిదాస్ వృత్తి రీత్యా పాములు పట్టుకునేవాడు. మతిళకమ్ సమీపంలోని త్రిప్పెక్కులమ్ ప్రాంతానికి చెందిన అతడు ఆదివారం అర్ధరాత్రి పాములు పట్టేందుకు వెళ్లాడు. పని ముగిశాక ఇంటికి బయలుదేరిన తరుణంలో.... జాతీయ రహదారిపై దాస్‌కు ఓ మృతిచెందిన పిల్లి కనిపించింది. యాక్సిడెంట్ కారణంగా మృతిచెందిన ఆ పిల్లి గర్భంతో ఉందని తెలుసుకున్న దాస్... పిల్లికి అక్కడే సర్జరీ చేసి నాలుగు చిన్న పిల్లులను బయటకు తీశాడు.
చిన్న పిల్లులకు ప్రథమ చికిత్స చేసి వాటిని ఇంటికి తీసుకెళ్లాడు హరిదాస్. వాటికి ప్రత్యేకమైన స్థావరం ఏర్పాటు చేసి ప్రతి ఆరగంటకు ఓసారి ఆహారం అందించి ఆయువు పోశాడు. అయితే.. హరిదాస్ సర్జరీ చేస్తుండగా కొందరు స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే