తన చెల్లిని ఏడిపించారని ఇద్దరు యువకులను చితకబాదాడు ఓ అన్న. దీంతో అతడిపై పగ పెంచుకున్న ఆ ఇద్దరు.. యువకుడిని హతమార్చారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దిల్లీలోని పటేల్ నగర్‌కు సమీపంలోని ఓ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం కంప్యూటర్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిని మార్గమధ్యలో మరో ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించగా అతను మరణించాడు. పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గేదెపై అత్యాచారం..
మహారాష్ట్రలోని పుణెలో ఓ దారుణం జరిగింది. దక్కన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి.. గేదెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు నేపాల్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పశువుల దాణా కోసం వెళ్లిన మహిళ హతం..
పశువుల దాణా తెచ్చేందుకు చెరకు తోటకు వెళ్లిన ఓ నలభై ఏళ్ల మహిళ అదే తోటలో విగతజీవిగా కనిపించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజాఫర్ నగర్లో జరిగింది. హత్యకు ముందు ఆమెపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శాంతను, సోను, రవి, రూప్‌చంద్ అనే నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపడతామన్నారు.
ఇవీ చదవండి:బంజారాహిల్స్‌లో చిన్నారిపై అత్యాచారం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
స్పాంజ్‌ను కడుపులో వదిలేసి కుట్లు వేసిన వైద్యులు.. రూ.15 లక్షలు జరిమానా