బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వెయొద్దని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ''మేం ఏ పార్టీకి మద్దతు పలకడం లేదు. ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు. భాజపాకు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం'' అని ఎస్కేఎమ్ నేత యోగేంద్ర యాదవ్ అన్నారు.
కిసాన్ మహా పంచాయత్‌లు..
బంగాల్లో కాషాయ పార్టీని ఓడించండంటూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పత్రికా ప్రకటనను సైతం విడుదల చేసింది. అప్పుడే రైతలు డిమాండ్లకు తలొగ్గి, సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని పేర్కొంది. మరోవైపు శని, ఆదివారాల్లో కిసాన్ మహా పంచాయత్ పేరుతో.. రైతు సంఘాల నాయకులు రాకేశ్ సింగ్ టికాయిత్, యుధ్వీర్ సింగ్‌లు.. బంగాల్లోని భవానీపుర్, నందిగ్రామ్, సింగూరు, అసన్సోల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: 'మోదీకి భయపడే.. రైతు ఉద్యమానికి విపక్షాలు దూరం'