Skill Development Program vs Smart Meters Project: నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో గత ప్రభుత్వం రూ.371 కోట్లు ముందస్తుగా చెల్లించిందని.. దానివల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందని.. కుంభకోణానికి సూత్రధారి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆయన్ని సీఐడీ అరెస్ట్ చేసింది. ఉన్నతాధికారులు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోకుండా, డబ్బు చెల్లించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చినట్లుగా.. సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా, ప్రభుత్వం ఇచ్చిన డబ్బులోనే కొంత ఖర్చుపెట్టి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశాయని.. ఆ డబ్బు కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిందనే అభియోగాలు మోపుతూ.. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేసింది.
No Corruption in AP Skill Development Program: అసలు ఆ డబ్బు చంద్రబాబుకు చేరిందనడానికి సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపలేదు. ప్రస్తుతానికి ఇది ఊహాజనిత ఆరోపణ మాత్రమే. అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా డబ్బు చెల్లించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారన్నది సీఐడీ చేస్తున్న మరో ప్రధాన అభియోగం. దాన్నే అధికారులు నోట్‌ఫైల్‌లో రాశారంటూ.. సీఐడీ రిమాండు రిపోర్టులో కొందరి వ్యాఖ్యల్ని ఉంటంకించింది. వాటిని పరిశీలిస్తే.. ఆ కంపెనీలకు డబ్బు చెల్లించాలని చంద్రబాబు తమపై ఒత్తిడి తెచ్చినట్టు అధికారులు ఎక్కడా నిర్దిష్టంగా రాయలేదు.
Chandrababu Arrest in Skill Development Scam: నిధుల నిర్వహణకు ప్రొటోకాల్స్ రూపొందించాలని ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డబ్బు ఒకేసారి విడుదల చేసే బదులు.. మొదట ఒక చోట పైలట్ ప్రాజెక్టు చేపడితే మంచిదని మరొకరు, "సీఎస్ నాతో మాట్లాడారు. దస్త్రాన్ని వెంటనే క్లియర్ చేయాలని కోరారు" అని మరొకరు.. ఇలా సూచనప్రాయంగా రాశారు. ఆర్థికశాఖలో అంతర్గత సమాచారం కోసం సిబ్బంది రాసుకునే నోట్ ఫైల్ ఆధారంగా మాజీ సీఎంను అరెస్టు చేయడం ఘోరమని అప్పట్లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చెప్పారు.
YCP Smart Meters Project Objections: రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లన్నింటికీ స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు రాష్ట్రప్రభుత్వం మొదట ఈసీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 28 వేల మీటర్లకు ఐఆర్డీ పోర్టు మీటర్లు అమర్చింది. వాటి పనితీరుపై రాష్ట్ర ఆర్థికశాఖ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ అనే సంస్థతో ఆడిట్ చేయించింది. ఆ ప్రాజెక్టులో అనేక లోపాలున్నట్టు పీఈజీ అధ్యయనంలో బయటపడింది. పీఈజీ నివేదికలోని అంశాలను ఉటంకిస్తూ.. స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టు వల్ల పెద్దగా ఒనగూరేదేమీ లేదని చెబుతూ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి విజయానంద్ గత ఏడాది సెప్టెంబరులో మూడు డిస్కంల సీఎండీలకు లేఖలు రాశారు.
Chandrababu Skill Development Case: నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపై అధికారులు అంతర్గత వినియోగం కోసం నోట్‌ఫైల్‌లో రాసుకున్న అంశాల్ని బట్టే.. భారీ కుంభకోణం జరిగిపోయిందని వైసీపీ నాయకులు వీరంగం చేస్తున్నారు. సీఐడీ జేసులు పెట్టింది. ఇంధనశాఖ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టు గురించి ఇదే శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏకంగా లేఖేరాశారు. ఆ ప్రాజెక్టుతో ప్రయోజనం అంతంతేనని ఆర్థికశాఖ నిర్వహించిన ఆడిట్ కూడా చెప్పింది.
Smart Meters Project in AP: వాటిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు మొండిగా ముందుకే వెళ్లింది. రూ.6వేల 898 కోట్లు ఖర్చు చేయడమంటే తమాషా విషయం కాదు. అంత భారీమొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు ఒనగూరుతున్న ప్రయోజనం ఏపాటిదనేది కీలకం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చడం వల్ల విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకంటే హాస్యాస్పదం ఉండదు. మోటార్లకు మీటర్లు పెడితే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది తప్ప.. కరెంటు వినియోగం ఎలా తగ్గుతుంది..?ప్రభుత్వం ఎవరి కళ్లకు గంతలు కట్టాలనుకుంటుంది?..
YCP Smart Meters Project: శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టులో ఒక్కో ఐఆర్డీ పోర్టు మీటరు, అనుబంధ పరికరాలకైన ఖర్చు 2వేల 583 రూపాయిలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో స్మార్ట్ మీటర్, అనుబంధ పరికరాలకు పెడుతున్న ఖర్చు సుమారు 20వేల 455రూపాయిలు. నిర్వహణ ఖర్చులతో కలిపి.. ఒక్కో మీటరుకి షిర్డీసాయి సంస్థకు చెల్లిస్తోంది 37వేల 072 రూపాయిలు మరి దీన్ని ఏమంటారో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇతర రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటరుకు 3వేల 500 నుంచి 4 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి.
YCP Govt Smart Meters Project: కేంద్రం సూచించిన ధర కూడా ఒక్కో మీటరుకి 6వేల రూపాయలు మాత్రమే. వాటితో పోలిస్తే డిస్కంలు ప్రతిపాదించిన ధరలు చాలా ఎక్కువ. ఇది ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు అనుచిత ప్రయోజనం కలిగించడమే కదా? సీఐడీ ఎందుకు ఇలాంటివాటిపై దృష్టి సారించదు? దీనికి వైసీపీ నాయకులు ఏ సమాధానం చెబుతారు? గత ప్రభుత్వం 371 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఇప్పటివరకు 2.13 లక్షల మంది శిక్షణ పొందారు.
TDP Skill Development Program: 75 వేల మందికి ఉద్యోగాలొచ్చాయి. ఇది కళ్లముందు కనిపిస్తున్న.. ఎవరూ కాదనలేని వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో చేసిన ఖర్చుకు ప్రతిఫలం కళ్లముందే కనిపిస్తుంటే.. దాన్ని వైసీపీ ప్రభుత్వం కుంభకోణంగా చిత్రిస్తుంది. మరి రాష్ట్రంలోని 18.58 లక్షల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో రూ.8,888 కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం ఖర్చు పెడుతుండటాన్ని, మొత్తం కాంట్రాక్టును ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, వైయస్ ఆర్ జిల్లాకు చెందిన విశ్వేశ్వర్రెడ్డికి సంబంధించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఏమనాలి? దేశంలో మరెక్కడాలేని విధంగా.. ఒక్కో మీటరు ఏర్పాటు, నిర్వహణకు ఏకంగా 37వేల 72 రూపాయిలు చొప్పున వెచ్చించడమేంటి? ఇది కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమంటే..?
CBN Arrest in Skill Development Scam: దీనితో పోలిస్తే.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు గత ప్రభుత్వం వెచ్చించిన ఖర్చు ఎంత? చేకూరిన ప్రయోజ నంతో పోలిస్తే ఆ ఖర్చు ఏపాటి? అక్కడ శిక్షణ పొంది ఉద్యోగాలు తెచ్చుకున్నవారి వల్ల.. కొన్ని వేల పేద, మధ్యతరగతి కుటుంబాలు బాగుపడ్డాయి. బాధ్యతగల ప్రభుత్వాలు ఖర్చుపెట్టాల్సింది ఉపాధి కల్పనకు అవసరమైన ప్రాజెక్టులపైనే కదా! అది నిధుల దుర్వినియోగం ఎలా ఆవుతుంది? దాన్ని వృథా ఖర్చు అంటే అసలు ఏమాత్రం అవసరంలేని స్మార్ట్‌మీటర్ల ప్రాజెక్టుపై కొన్ని వేలకోట్లు వృథా చేయడాన్ని ఏమనాలి? అసలు ఆ ప్రాజెక్టు వల్ల ఒక్క రైతుకైనా ప్రయోజనం ఉందా..?
CM Jagan Smart Meters Project Objections: మోటార్లకు స్మార్ట్ మీటర్ను పెట్టడం వల్ల రైతుకు ఒక్క రూపాయైనా అదనంగా కలిసొస్తుందా? రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్డీపీలో 0.5 శాతం అదనంగా అప్పు తెచ్చుకునే వెసులుబాటు తప్ప, పైసా ఉపయోగం లేదు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ ఆర్థిక విధానాల వల్ల పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, ప్రజల్ని మరింత ఊబిలోకి నెట్టేయడం, స్మార్ట్ మీటర్లపై పెట్టే ఖర్చును.. ట్రూఅప్, సర్దుబాటు ఛార్జీల పేరుతో మళ్లీ ప్రజలపైనే బాదేయడం తప్ప ఆ ప్రాజెక్టతో ఏం ప్రయోజనం? ఒక్క వైసీపీ నాయకుడైనా దీనికి సమాధానం చెప్పగలరా అని సామాన్య ప్రజానికం, ప్రతిపక్ష పార్టీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
PV Ramesh on Skill Development Case: నేను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవం- పీవీ రమేష్