ఆ చిన్నారి మృతి ప్రమాదవశాత్తు జరిగిందని అధికారులు భావించారు. కానీ ఆమె అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిందని దర్యాప్తులో తేలింది. ఆరేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను హత్య చేశాడో ఓ వ్యక్తి. కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియర్ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. చిన్నారి మృతికి కారణమైన నిందితుడు అర్జున్ (22)ను పోలీసులు అరెస్టు చేశారు.
జూన్ 30న ఓ గదిలో శాలువాకు వెళాడుతూ చిన్నారి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. చిన్నారి మెడపైన గుర్తులు పరిశీలించిన అధికారులు.. ఆమె ఆడుకుంటుండగా ఆ శాలువా మెడకు చుట్టుకుని చనిపోయి ఉంటుందని భావించారు. కానీ అనుమానాస్పదంగా ఉన్న ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగించగా.. పోస్ట్మార్టంలో ఆమె అత్యాచారానికి గురైన విషయం వెల్లడైంది. చిన్నారిపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడి.. చివరికి ఆమె మెడకు సాలువా చుట్టి హత్య చేశాడని ఇడుక్కి మెడికల్ కాలేజీ వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి : ఆహారం ఇచ్చేందుకు వెళ్లి.. వైద్యురాలిపై అత్యాచారం!