Six Members of the Same Family were Killed in Nizamabad District : నిజామాబాద్ జిల్లా మాక్లూర్‌కు చెందిన ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన ప్రసాద్‌లు స్నేహితులు. ప్రశాంత్ స్థిరాస్తి వ్యాపారం, ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ప్రసాద్ స్థానికంగా వ్యవసాయం చేస్తుండేవాడు. ప్రసాద్ ఓ కేసులో అరెస్టై ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఆ కేసు విషయంలో గ్రామస్తులు బహిష్కరించడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో ప్రశాంత్‌ను ఆశ్రయించాడు.
Six Members of Same Family were Killed : అప్పు ఇప్పిస్తానని ప్రసాద్ ఇల్లు, పొలాన్నితన పేరి బదలాయించుకున్న ప్రశాంత్ అప్పు ఇప్పించలేదు. ఇళ్లును తిరిగి ప్రసాద్ బదలాయించడంలోనూ జాప్యం చేశాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ప్రశాంత్ కోసం గాలిస్తూ తన ఆస్తి తిరిగి రాబట్టుకునేందుకు ప్రసాద్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు, ఆస్తి తిరిగి ఇవ్వొద్దని అనుకున్న ప్రశాంత్ కుటుంబం మొత్తాన్ని మట్టు బెడితే ఆస్తి తనదే అవుతుందని భావించాడు. ఇందులో భాగంగానే ప్రసాద్ కుటుంబంలో ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు.
''ప్రసాద్‌ను తన కుటుంబ సభ్యులను చంపిన వారని కఠినంగా శిక్షించాలి. ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. ప్రశాంత్‌కు నాకు డబ్బుల విషయంలో గొడవ జరుగుతుందని చెప్పాడు. అప్పు ఇప్పిస్తానని ప్రశాంత్ ఇల్లు, పొలాన్ని తన పేరిట రాసుకొని మోసం చేశాడని చెప్పాడు.'' - మృతుడు ప్రసాద్ బంధువులు
Family Murder In Nizamabad : ప్రసాద్ కు భార్య రమణి, కవల పిల్లలు చైత్రిక్, చైత్రిక, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. మొదటి చెల్లెలు దివ్యాంగురాలు కావడంతో తనతో పాటే ఉంటోంది. అలాగే చిన్న చెల్లెలు పెళ్లయ్యి విడాకులు కావడం వల్ల ప్రసాద్ కుటుంబంతోనే ఉంటోంది. మొదట ప్రసాద్‌ను పథకం ప్రకారం హత్య చేసిన ప్రశాంత్ డిచ్‌పల్లి సమీపంలో రోడ్డు ప్రక్కన పాతి పెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి అతని భార్య రమణిని బాసర సమీపంలో గోదావరి నదిలో తోసి హతమార్చాడు. ఆ తర్వాత అమ్మానాన్నలు వేరే చోట ఉన్నారని చెప్పి పిల్లలను తీసుకెళ్లి బాల్కొండ సమీపంలోని సోన్ వద్ద మట్టుబెట్టి కాల్చేశాడు.
నాగర్‌కర్నూల్‌లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం
తర్వాత దివ్యాంగురాలైన ప్రసాద్ పెద్ద చెల్లెలు స్వప్నను మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద హత్యచేశాడు. చిన్న చెల్లెలు సృవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద హత్యచేసి మృతదేహాన్ని దహనం చేశాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఈ నెల 13న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు అప్పటికే ఆరుగురిని అంతమెందించినట్లు పేర్కొన్నారు. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరికొందరు సైతం ఈ హత్యల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిండు కుటుంబం నిలువునా హత్యకు గురి కావడంతో గ్రామంలో తీవ్ర విషాదాన్ని అలముకుంది.
ఫిలింనగర్లో దారుణం- అప్పు తీర్చలేదని హతమార్చారు
తల్లి తల నరికి తీసుకెళ్లిన కొడుకు- ఆస్తి కోసం దారుణం!
ప్రేమకు నో చెప్పిందని ప్రియురాలి కుటుంబం దారుణ హత్య.. విషం తాగి యువకుడు సూసైడ్!