బిహార్లో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రహరీ గోడ కుప్పకూలడం వల్ల.. ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఇదీ జరిగింది..
ఖగడియా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. కాలువ నిర్మాణం కోసం.. ఆ బడి సమీపంలో కూలీలు గొయ్యి తవ్వారు. ఈ క్రమంలో అక్కడి ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు అధికారులు.
అయితే.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదీ చూడండి: 1,008మంది మహిళలతో 'శివస్తోత్రం'- పులకించిన వారణాసి