వర్చువల్ విధానంలో సోమవారం నిర్వహించబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు భారత్ తొలిసారిగా అతిథ్యమిస్తోంది. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
2017లో షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యత్వం తర్వాత తొలిసారి భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ కార్యక్రమంలో రష్యా, చైనా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ ప్రధానులు పాల్గొననున్నారు.
పొరుగు దేశమైన పాకిస్థాన్ తరపున ఆ దేశ విదేశాంగశాఖ పార్లమెంటరీ కార్యదర్శి పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. మరోవైపు పరిశీలక దేశాల హోదాలో అఫ్గానిస్థాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా దేశాల ప్రతినిధులు పాల్గొంటారు.
ఇదీ చదవండి:'రైతుల ర్యాలీలో రాజకీయ జోక్యం లేదు'