ETV Bharat / bharat

అత్యాచారానికి గురైన అక్కాచెల్లెళ్లు.. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య - two sisters raped in assam

Sisters Suicide After Rape In Assam : అత్యాచారానికి గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్మహత్య చేసుకున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అసోంలో జరిగింది.

Sisters Suicide After Rape In Assam
Sisters Suicide After Rape In Assam
author img

By

Published : Aug 6, 2023, 3:49 PM IST

Updated : Aug 8, 2023, 1:46 PM IST

Sisters Suicide After Rape In Assam : అసోం.. కామ్​రూప్​ జిల్లాలో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తులసిబారి ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు బంధువులు. వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దిరిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయిలు.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ హితేశ్​ చంద్ర రాయ్ స్పందిచారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Lover Raped Student : మరోవైపు, ఇంటర్​ చుదువుతున్న ఓ విద్యార్థినిని తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు ఆమె ప్రియుడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బ్లాక్​మెయిల్ చేస్తూ ఐదు నెలలుగా బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా ప్రాంతానికి చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తరచూ తమ కోరికలు తీర్చాలని అడిగారు. లేదంటే వీడియోలు, ఫొటోలు తమ స్నేహితులకు పంపిస్తామని బెదిరించి గత ఐదు నెలలుగా బాలికను సాముహికంగా అత్యాచారం చేశారు నిందితులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

అత్తింటి వేధింపులు.. బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు చిన్నారులతో సహా..

Last Updated : Aug 8, 2023, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.