ETV Bharat / bharat

Sircilla, Telangana Election Results 2023 Live : సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పాంచ్ పటాకా - సిరిసిల్ల అసెంబ్లీ రిజల్ట్స్ 2023

Sircilla, Telangana Election Results 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ తాను ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్‌, ఐదోసారి బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్​ రెడ్డి బరిలో నిలిచారు. కాగా సిరిసిల్లలో కేటీఆర్ ఐదోసారి విజయఢంకా మోగించారు.

Telangana Election Results 2023 Live
Sircilla
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 5:06 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sircilla, Telangana Election Results 2023 Live : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారిన నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి(ఉపఎన్నికతో కలిపి) రంగంలోకి దిగుతుండగా, సిరిసిల్ల మీద ప్రత్యేక ఫోకస్ ఉందనే చెప్పాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున కేకే మహేందర్ మరోసారి బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి మహిళ అభ్యర్థిగా రాణి రుద్రమ్మను కమలం పార్టీ రంగంలోకి దింపింది. 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వచ్చిన కేటీఆర్‌‌కు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నుంచి గట్టి పోటీ నెలకొంది. కాగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఐదోసారి విజయం సాధించారు.

Telangana Election Results 2023 Live : అయితే 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) రెబల్ అభ్యర్థిగా బరిలో దిగిన కేకే మహేందర్ రెడ్డిపై కేటీఆర్, కేవలం 171 ఓట్ల తేడాతో విజయం సాధించగా, 2018 ఎన్నికల్లో మాత్రం 89 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈసారి లక్ష మెజార్టీ సాధించటమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగానే ప్రచారం నిర్వహించగా, ఎలాగైనా కేటీఆర్‌ను ఓడించటమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కృషి చేశాయనే చెప్పాలి. మరోవైపు బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ కూడా కేటీఆర్‌ ఓటమే లక్ష్యంగా ప్రచారం చేసినా, ఆమె ప్రభావం పెద్దగా లేదనే తెలిసింది.

Dubbaka, Telangana Assembly Election Results 2023 Live : దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం

Sircilla Election Results 2023 Live : సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్, పలు శాఖలకు మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి ఎక్కువగా రాకపోవటం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవటం కొన్ని ప్రాంతాల్లో హామీలు నెరవేర్చకపోవటం లాంటి అంశాలు కేటీఆర్‌‌కు ప్రతికూలంగా మారినట్టు సమాచారం. దీనికి తోడు ప్రభుత్వంపై యువతలో ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ఓట్లు మారినట్టుగా సర్వేలు చెప్తున్నాయి. దీంతో కేటీఆర్‌కు, కేకే మహేందర్​కు మధ్య హోరాహోరి పోరే నెలకొన్నట్టు తెలుస్తోంది. అయినా చివరకు నియోజకవర్గ ప్రజలు కేటీఆర్‌కే పట్టం కట్టారు.

ఇక సిరిసిల్ల నియోజకర్గం సింహభాగం గ్రామీణ ప్రాంతమే అని చెప్పాలి. ఇక్కడ 71.65 శాతం ఓటర్లు గ్రామీణ ప్రాంతానికి చెందినవారే. 2014లో సిరిసిల్లలో మొత్తం 73.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 53 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్ రావును కేటీఆర్ ఓడించారు. ఇక 2018 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 80.57 శాతం ఓటింగ్ నమోదు కాగా, కేటీఆర్‌కు 125,213 ఓట్లు అంటే మొత్తం ఓట్లలో 70.89 శాతం రావడం విశేషం. కేకే మహేందర్​కు 36,204 ఓట్లు(21 శాతం) పోలయ్యాయి. ఇక 2023లో 77 శాతం ఓటింగ్ జరగ్గా సిరిసిల్ల గడ్డపై సత్తా చాటేదెవరన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఐదోసారి కూడా నేతన్నలు కేటీఆర్‌కే జై కొట్టారనే చెప్పాలి. సిరిసిల్లలో కేకే మీద కేటీఆర్ గెలుపొందారు.

KTR, Harish Rao Telangana Assembly Election Results 2023 Live : కేటీఆర్, హరీశ్​రావు - గెలుపు లాంఛనమే, మెజార్టీ 'చే'జారే

Gajwel, Telangana Assembly Election Result 2023 Live : గజ్వేల్​లో కేసీఆర్​ ముందంజ - ఏడు రౌండ్ల వివరాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.