ETV Bharat / bharat

Siemens Ex MD Suman Bose on Skill Development Case ఆరోపణలన్నీ బోగస్.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పూర్తిగా నిరాధారం : సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ - Skill Development Project Suman Bose

Siemens Ex MD Suman Bose on Skill Development Case స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పూర్తిగా నిరాధారమైనదని సీమెన్స్ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ స్పష్టం చేశారు. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‌ఎస్‌డీసీనే.. ప్రాజెక్టు బోగస్‌ అని ఆరోపించడమేంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క కేంద్రాన్ని సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు... ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని సుమన్ బోస్ తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వివరాలను దిల్లీలో మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.

skill_development_project
Siemens Ex MD Suman Bose on Skill Development Case ఆరోపణలన్నీ బోగస్
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 12:38 PM IST

Updated : Sep 17, 2023, 3:54 PM IST

Skill Development Project Suman Bose : 2021 వరకు స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా 2.13 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్ బోస్ తెలిపారు. బిల్ట్ ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్ ఆపరేట్ పద్ధతిలో ఈ ప్రాజెక్టు నడిచిందని వివరించారు. 2021లో ప్రాజెక్టును, శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు విజయవంతమైందని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని సుమన్ బోస్ గుర్తుచేశారు. 2018లోనే తాను ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయానని, 2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ(APSSDC) లో ఏం జరిగిందో నాకు తెలియదు గానీ, గతంలో మెచ్చుకున్న వారే ఈ ప్రాజెక్టు బోగస్‌ అని ఆరోపించడం వెనుక మిస్టరీ దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శిక్షణ కేంద్రాలు చూడకుండానే అక్రమాలు జరిగాయని ఆరోపించడాన్ని తప్పుబట్టారు. ఒక్క కేంద్రం సందర్శించలేదు.. ఒక్క తనిఖీ జరగలేదు.. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ అని పేర్కొన్నారు.

Siemens Ex MD Suman Bose on Skill Development Case ఆరోపణలన్నీ బోగస్.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు పూర్తిగా నిరాధారం : సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్

CID Sanjay AAG Ponnvolu : కృష్ణా, గంగా నదులు... నాసిక్‌లో పుట్టాయంట! సీఐడీ చీఫ్, ఏఏజీలు చెప్పారు..! పిల్లలూ నిజమేనా...?

'ఒక హత్య జరిగిందని విచారణ చేయాలంటున్నారు.. విచిత్రంగా హత్యకు గురైనట్లు చెబుతున్న వ్యక్తి బతికే ఉన్నాడు.. బతికుండగానే హత్య జరిగిందని విచారణ చేస్తామంటున్నారు' అని సీఐడీ తీరును తప్పుబట్టారు. నేను ఒక ప్రొఫెషనల్‌ను.. లాయర్‌ను కాదు అని చెప్పిన సుమన్ బోస్.. నాపై, ఇతరులపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నిరాధారమైందన్న సీమెన్స్‌ (Siemens Company) మాజీ ఎండీ.. 2.32 లక్షల మందికి సర్టిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. 2014లో ఐటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌ కోసం ముందుకు వచ్చిందని సుమన్‌బోస్‌ (Suman Bose) తెలిపారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్‌ ఏర్పాటు చేశామని, 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యాలు పొందారని వెల్లడించారు. ఈ క్రమంలో 2021లో స్కిల్ డెవలప్మెంట్ బాగా జరిగింది అన్న లెటర్ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందుకున్నామని తెలిపారు.

Apskilldevelopmenttruth.com Website : చంద్రబాబు కేసులో వాస్తవాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. వెబ్​సైట్ ప్రారంభించిన టీడీపీ

అన్ని అంశాలు అధ్యయనం చేసిన తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభించాం.. విజయవంతం చేశాం.. ఎటువంటి అవినీతి లేదు.. విజయవంతమైన ప్రాజెక్టును బోగస్ ప్రాజెక్టు, అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా అని ప్రశ్నించారు. సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి మధ్య ఒప్పందం ఉంది... మనీ లాండరింగ్ జరగలేదని అన్నారు.

ఒక సాఫ్ట్ వేర్ పై యువతకి అవగాహన కల్పించినపుడు ఆ సాఫ్ట్ వేర్(Software) కి డిమాండ్ పెరుగుతుందన్న సుమన్ బోస్.. మార్కెటింగ్ లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడీ విషయం న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి కోర్టులకు అన్ని విషయాలు చెబుతాం అని స్పష్టం చేశారు. చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్... ఇదే తరహా ప్రాజెక్టు చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం.. చేస్తున్నాం అని తీవ్రస్థాయిలో ఖండించారు. కియా మోటార్స్ కి అవసరమైన మానవ వనరులకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామని, దాన్ని చూసి... 'ఇంత గొప్పగా చేశారా..' అని కియా సంస్థ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.

CID Chief Sanjay Comments on Chandrababu Case: 'ప్రైవేటు వ్యక్తికి పదవులు..' చంద్రబాబు కేసుపై సీఐడీ చీఫ్ ఏమన్నారంటే..!

Last Updated : Sep 17, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.