నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ తనను, తన ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపించారు. అనాలోచితంగా సొంతపార్టీపైనే నిందులు వేయడం తగదని హితపు పలికారు. సిద్దూ బహుశా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే ఆలోచనలో ఉంటే నిరభ్యంతరంగా చేరవచ్చని సూచించారు.
సిద్దూ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియడం లేదన్న అమరీందర్.. రోజూ సొంత ప్రభుత్వాన్నే విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే పాటియాలా నుంచి సిద్దూ పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు.
సిద్దూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే.. ఇది కచ్చితంగా పార్టీ నియమాలను అతిక్రమించినట్లే. ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎందుకు? బహుశా ఆప్‌లో చేరే ఆలోచనలో ఉండి ఉంటారు. భాజపా ఆయన్ను తిరిగి ఆహ్వానిస్తుంది అని నేను అనుకోను. సిద్దూ విషయంలో అకాళీదల్ కూడా భాజపానే అనుసరిస్తుంది. దీంతో ఆయన ఏ పార్టీని ఎంచుకోలేని పరిస్థితి. అయితే మాతోనే ఉండాలి. లేకపోతే మారుతాడు.
-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: సీఎం అమరీందర్ సింగ్‌తో సిద్ధూ భేటీ