మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తాజాగా మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 51కి చేరింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మంగళవారం ఉదయం.. 58మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బాణసాగర్ కాలువలో పడింది. ఏడుగురు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్న కొద్దీ ఒక్కో మృతదేహం బయటపడుతుండటం విషాదకరం.
ఇదీ చదవండి : చివరి నిమిషంలో రూటు మార్పే ముప్పైందా!