హిమాచల్ ప్రదేశ్‌లో 115 ఏళ్ల పురాతన స్టీమ్ రైలింజిన్ విజయవంతంగా ట్రాక్‌పై ప్రయాణించింది. సిమ్లా నుంచి కైత్లిఘాట్ రైల్వేస్టేషన్ల మధ్య హెరిటేజ్ కేసీ-520 స్టీమ్ లోకోమోటివ్ ఇంజిన్ ట్రయల్ రన్‌ను దిగ్విజయంగా నిర్వహించారు అధికారులు. యూనెస్కో స్థాయి గుర్తింపుపొందిన సిమ్లా-కాల్కా రైల్వే ట్రాక్‌పై ఈ రన్ జరగడం విశేషం.
రెండు బోగీలతో మంగళవారం ఉదయం 11:05 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రైలింజిన్.. అనేకమందిని తమ గమ్యస్థానాలకు చేర్చి సాయంత్రం 4:30 గంటలకు సిమ్లా రైల్వే స్టేషన్‌కు తిరిగొచ్చింది. ఇలా ఈ నెల 30 వరకు ఈ రైలు సేవలందించనున్నట్టు సమాచారం. గతంలోనే ఈ ట్రయల్స్‌ను నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి కారణంగా సాధ్యపడలేదు.
చరిత్ర
హెరిటేజ్ కేసీ-520 స్టీమ్ ఇంజిన్‌ను 1905లో ఉత్తర బ్రిటీష్ లోకోమోటివ్ కంపెనీ రూపొందించింది. పలు కారణాల వల్ల 1971లో వీటిసేవలు నిలిచిపోయాయి. అయితే.. మరమ్మతుల అనంతరం 2001 నుంచి మళ్లీ పట్టాలెక్కింది హెరిటేజ్.
ఈ లోకోమోటివ్ ఇంజిన్ 41 నుంచి 80 టన్నుల బరువునులాగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గతంలో జాయ్రైడ్ల కోసం వినియోగించిన ఈ ఇంజిన్‌ను.. ప్రస్తుతం పర్యటకుల కోరిక మేరకు మళ్లీ ట్రాక్ ఎక్కించింది రైల్వే శాఖ.
ధర ఎంతంటే.?
పండుగ సీజన్ సందర్భంగా రైడ్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉండటం వల్ల.. ప్రభుత్వం కూడా సీటింగ్ సామర్థ్యాన్ని 30 నుంచి 50 శాతానికి పెంచింది. విదేశీ పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ రైలింజిన్ బుకింగ్ ధర రూ. 1.15లక్షలు(సిమ్లా నుంచి కైత్లిఘాట్) ఉంటుంది.
ఇదీ చదవండి: 'టెలీ-లా'తో 4 లక్షల మందికి న్యాయసేవ