ETV Bharat / bharat

'వ్యాక్సిన్‌ ఫార్ములా ఇతర సంస్థలతో పంచుకోండి!' - కరోనా టీకా ఫార్ములా

కరోనా వ్యాక్సిన్​ ఫార్ములాను ఇతర సంస్థలతో పంచుకోవాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్​.. కేంద్రానికి సూచించారు. తద్వారా టీకా ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.

kejriwal
కేజ్రీవాల్​
author img

By

Published : May 11, 2021, 10:37 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిన దృష్ట్యా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వ్యాక్సిన్‌ ఫార్ములాను ఇతర సంస్థలతో పంచుకునేలా చర్యలు చేపట్టాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇతర కంపెనీలకు వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేసే అవకాశాన్ని కల్పించవచ్చని సూచించారు. దీనివల్ల టీకా డోసులను గణనీయంగా అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రధానికి రాసిన లేఖలో అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు.

'ఇప్పటివరకు దేశంలో భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. నెలకు కేవలం 6 నుంచి ఏడు కోట్ల డోసులు మాత్రమే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సామర్థ్యంతో దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేయాలంటే మరో రెండు సంవత్సరాలు పడుతుంది. ఆలోపు ఎన్నో వేవ్‌లు(కరోనా విజృంభణ దశలు) వస్తాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది' అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ తయారీకి చాలా సంస్థలను రంగంలోకి దించాలన్నారు. అందుకే ఈ రెండు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌ ఫార్ములాను తీసుకొని ఇతర వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలకు అందించడం ద్వారా ఉత్పత్తిని భారీగా పెంచవచ్చని సూచించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడిన సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కేంద్రప్రభుత్వానికి అధికారం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు.

దేశంలో ప్రస్తుతం రెండు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నప్పటికీ స్వదేశంతో పాటు ఇతర దేశాలకు ఆయా సంస్థలు టీకాలు ఎగుమతి చేస్తున్నాయి. దీంతో దేశంలో డిమాండ్‌కు సరిపడా కరోనా టీకాలను అవి సరఫరా చేయలేకపోతున్నాయి. అయితే, ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ అనుమతి పొందినప్పటికీ వీటి పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో పాలు రాష్ట్రాలు ఇతర దేశాల వ్యాక్సిన్లను సమీకరించుకునేందుకు గ్లోబల్‌ టెండర్లను పిలిచేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆక్సిజన్‌కు కొరతలేదు..

దిల్లీలో కొవిడ్ బాధితుల చికిత్సకు అవసరమైన ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్‌కు కొరత లేదని ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. దిల్లీలో కరోనా రెండోదశ వ్యాప్తి క్రమంగా తగ్గుతోందన్నారు. అందరి సహకారంతో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహించామని, అందువల్లే కేసులు సంఖ్య అనూహ్యంగా తగ్గిందన్నారు. గత కొన్ని రోజులుగా వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లను కూడా పెంచుతున్నట్లు కేజ్రీవాల్‌ వివరించారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి దిల్లీ త్వరలోనే కోలుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. " ఏప్రిల్‌ చివరి వారంలో రోజుకు 25వేల వరకు కేసులు నమోదయ్యేవి. కానీ, ప్రస్తుతం రోజువారీ కేసులు 13 వేలకు పడిపోయాయి. పాజిటివిటీ రేటు కూడా 36 శాతం నుంచి 19 శాతానికి తగ్గింది. దేశ రాజధానిలో ప్రస్తుం 85,000 క్రియాశీల కేసులు ఉన్నాయి" అని వివరించారు. పాజిటివిటీ రేటు తగ్గినప్పటికీ ఏమాత్రం అశ్రద్ధ చూపవద్దని సీఎం హెచ్చరించారు.

ఇదీ చదవండి: కొవిడ్​ కేర్ సెంటర్​గా గోశాల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.