కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. భాజపా తరఫున తమిళనాడులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అలాగే 'విజయ్ సంకల్ప్ మహా సంపర్క్' పేరిట నిర్వహించే ఎన్నికల ప్రచార యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 10.20కి కన్యాకుమారిలోని సుచీంద్రం ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తమిళనాట షా బిజీబిజీ..
'విజయ్ సంకల్ప్ మహాసంపర్క్'లో భాగంగా భాజపా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారు. అనంతరం 11.15కి హిందూ కాలేజీ నుంచి కామరాజ్ విగ్రహం వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు షా. మధ్యాహ్నం 12.30కి ఉడుపి హోటల్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం కేరళకు బయలుదేరి వెళతారు అమిత్ షా. అక్కడ భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే విజయ యాత్రలో షా పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు తిరువనంతపురంలోని శ్రీ రామకృష్ణ మఠాన్ని సందర్శిస్తారని రాష్ట్ర భాజపా విభాగం వెల్లడించింది.
ఇదీ చదవండి: 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'