ETV Bharat / bharat

మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: షా - బంగారు బంగాల్​

బంగాల్​ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. బంగాల్​లో భాజపా ప్రభుత్వమే కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గంగాసాగర్​ మేళాను అంతర్జాతీయ టూరిస్టు సర్క్యూట్​గా మార్చుతామని తెలిపారు.

Shah promises to put Gangasagar
మేం అధికారంలోకి వస్తే మహిళలకు 33% కోటా: షా
author img

By

Published : Feb 18, 2021, 3:45 PM IST

Updated : Feb 18, 2021, 4:56 PM IST

బంగాల్​ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే భాజపా పోరాడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. మమతా బెనర్జీ సర్కార్‌ను ఓడించి భాజపాను అధికారంలోకి తేవడం తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే లక్ష్యమన్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ రెండు రోజుల పర్యటన నిమిత్తం బంగాల్‌కు వచ్చిన అమిత్‌ షా.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కాక్‌ద్విప్‌లో గురువారం ఐదో విడత పరివర్తన్‌ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం ప్రయోజనాలు కల్పిస్తామని అమిత్​ షా హామీ ఇచ్చారు.

భాజపా ప్రభుత్వమే..

బంగాల్‌ ఎన్నికల్లో పోరాటం తమ పార్టీ బూత్‌ కార్యకర్తలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సిండికేట్ల మధ్యేనన్నారు. రాబోయే ఎన్నికల్లో బంగాల్​‌లో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక ఏటా లక్షలాది మంది యాత్రికులు వచ్చే గంగాసాగర్‌ మేళాను అంతర్జాతీయ టూరిస్ట్‌ సర్క్యూట్‌గా మారుస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని రకాల పర్యాటక ప్రాజెక్టులను ఇక్కడ విజయవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అవినీతిపై దర్యాప్తు చేస్తాం..

భాజపా చేపట్టిన పరివర్తన్‌ యాత్రలు 294 నియోజకవర్గాలను కలుపుతూ కొనసాగుతున్నాయని తెలిపారు. బంగాల్‌లో రాజకీయ హింసకు 130 మంది భాజపా కార్యకర్తలు మృతిచెందారన్నారు.తమ పార్టీ అధికారంలోకి రాగానే అంపన్‌ తుపాను నిధుల పంపిణీలో అవినీతిపైనా దర్యాప్తు చేస్తామన్నారు. అలాగే, తుపానులు, పర్యావరణ విపత్తుల నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

భాజపా గూటికి మరో నటుడు

మరోవైపు, ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడిన సినీనటుడు హిరన్‌ ఛటర్జీ భాజపాలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన అమిత్‌ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో చేరారు. యశ్‌దాస్‌గుప్తా చేరిన మరుసటి రోజే హిరన్‌ చేరడం గమనార్హం.

ఇదీ చదవండి:అన్నాడీఎంకేపై పట్టు కోసం శశికళ న్యాయపోరాటం

Last Updated : Feb 18, 2021, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.