ETV Bharat / bharat

మహిళపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. బైక్​తో ఢీకొట్టి.. దాడి చేసి.. - మహిళపై లైంగిక దాడి

బైక్​పై వెళ్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్​. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Sexual harassment
లైంగిక వేధింపులు
author img

By

Published : Nov 11, 2022, 9:03 PM IST

ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. నిందితుడు శరవణన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడయార్​కు చెందిన బాధితురాలు బైక్​పై వెళ్తోంది. రామ్​నగర్​కు చెందిన శరవణన్​ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమెను బైక్​తో వెంబడించాడు. అనంతరం ఆమె బైక్​ను ఢీకొట్టాడు. దీంతో బాధితురాలు కింద పడిపోయింది. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు.

నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న విషయం గమనించిన బాధితురాలు అతడిని వెనక్కి నెట్టేసింది. అయితే ఈ క్రమంలో నిందితుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అసభ్యపదజాలంతో బాధితురాలిని దూషించాడు. ఆమెపై దాడి అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. నిందితుడు శరవణన్​ను అరెస్ట్ చేశారు. నిందితుడు.. బాధితురాలిని ద్విచక్రవాహనంపై వెంబడించి దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

ఇవీ చదవండి: హిమాచల్​ ప్రదేశ్​లో పోలింగ్​కు రంగం సిద్ధం

రోడ్డుపై అర్ధరాత్రి మొసలి హల్​చల్​ వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.