ETV Bharat / bharat

బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని చితకబాది అర్ధనగ్నంగా ఊరేగింపు - గ్యాంగ్​ రేప్​

Sexual harassment: 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని అర్ధనగ్నంగా ఊరేగించిన సంఘటన కర్ణాటకలోని హవేరీలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరోఘటనలో 11 ఏళ్ల బాలికపై చర్చి ఫాదర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోవైపు.. బిహార్​లో కట్నం కోసం భార్య, ఇద్దరు పిల్లలను విషమిచ్చి హత్య చేశాడు ఓ భర్త.

Sexual harassment
బాలికపై లైంగిక వేధింపులు
author img

By

Published : Apr 24, 2022, 6:29 PM IST

Sexual harassment: 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ యువకుడిని అర్ధనగ్నంగా ట్రాక్టర్​పై ఊరేగించారు గ్రామస్థులు. ఈ సంఘటన కర్ణాటకలోని హవేరి జిల్లా హిరెకెరూర్​లో ​జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి ఫిర్యాదు మేరకు 11 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

మరోవైపు.. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్​ చేసి జుడీషియల్​ కస్టడీకి తరలించారు. ఏప్రిల్​ 21న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Sexual harassment
అర్ధనగ్నంగా నిందితుడి ఊరేగింపు

11 ఏళ్ల బాలికపై చర్చి ఫాదర్​ అత్యాచారం: ఉత్తర్​ప్రదేశ్​లోని బాగ్​పత్​లో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై ఓ చర్చి ఫాదర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. చండీనగర్​ ప్రాంతంలోని ఓ గ్రామంలో శనివారం ఈ అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సైక్లింగ్​ కోసం బాలిక చర్చికి వెళ్లగా ఫాదర్​ ఆల్బర్ట్​ ఈ దారుణానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని, ఇంటికి తిరిగి వచ్చాక తనపై జరిగిన అఘాయిత్యంపై కుటుంబ సభ్యులకు బాధితురాలు చెప్పిందని వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఆదివారం అరెస్ట్​ చేశామన్నారు.

ఇల్లు చూపిస్తానని తీసుకెళ్లి మహిళపై రేప్​: అద్దెకు ఉండేందుకు ఇంటిని చూపిస్తానంటూ తీసుకెళ్లి 24 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ రియల్​ ఎస్టేట్​ ఏజెంట్​. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం రాత్రి జరిగింది. హెయిర్ ​డ్రెస్సర్​గా పని చేస్తున్న మహిళ కొద్ది రోజులుగా అద్దె ఇంటి కోసం 38 ఏళ్ల రియల్​ ఎస్టేట్​ ఏజెంట్​తో మాట్లాడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటిని చూపిస్తానని ఫోన్​ చేసి రమ్మన్నాడు. వాఘోలీ ప్రాంతానికి చేరుకున్న మహిళను ఫ్లాట్​ ఓనర్​ వచ్చేందుకు సమయం పడుతుందని, అప్పటివరకు తన ఇంట్లో వేచి ఉండాలని సూచించాడు. నమ్మి అతడి ఇంటికి వెళ్లగా.. దుస్తులు తీయాలని కోరాడు. ఆ దుశ్చర్యను వీడియో తీశాడు. వీడియో వైరల్​ చేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వాష్​రూమ్​కి వెళ్లాలని చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇరుగుపొరుగు వారి సాయంతో నిందితుడిని ఇంట్లో ఉంచి తాళం వేసింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్ట్​ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బెయిల్​పై వచ్చి అత్యాచార బాధితురాలి సోదరుడి కిడ్నాప్​: అత్యాచార కేసులో అరెస్టైన ఓ నిందితుడు బెయిల్​పై వచ్చి బాధితురాలి సోదరుడిని కిడ్నాప్​ చేశాడు. తనపై పెట్టిన అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. ఏడోతరగతి బాలుడిని సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటన రాజస్థాన్​, కోటా జిల్లాలో జరిగింది.

బాలుడి పెద్ద సోదరిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఏడాది క్రితం అరెస్టయ్యాడు ధోబి. ఇటీవలే బెయిల్​పై బయటకు వచ్చాడు. బాలుడి కిడ్నాప్​పై మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బాధిత కుటుంబం ఫిర్యాదు చేయగా బూందీ నగరంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు.

స్క్రూడ్రైవర్​తో భార్య గొంతు చీల్చి హత్య: మద్యం మత్తులో స్క్రూడ్రైవర్​తో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ సోన్​భద్ర జిల్లాలోని ఝనక్​పుర్​ రందహ్​ గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ​సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు రఘు బడి, మృతురాలు సావిత్రి దేవిగా (55) గుర్తించారు. శనివారం రాత్రి ఫూటుగా మద్యం తాగివచ్చి భార్యతో గొడవకు దిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచక్షణారహితంగా కొట్టడం సహా స్క్రూడ్రైవర్​తో గొంతు, నోటిపై దాడి చేసినట్లు చెప్పారు. మరోవైపు.. ఇరువురి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయని, ఓసారి పంచాయితీ సైతం పెట్టినట్లు గ్రామ పెద్ద సంజయ్​ యాదవ్​ తెలిపారు.

భార్య, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి: బిహార్​, నలంద జిల్లా నూర్సరాయ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో విషాద ఘటన జరిగింది. వరకట్నం కోసం భార్య, ఇద్దరు పిల్లలను విషం పెట్టి హత్య చేశారు భర్త, అతని కుటుంబ సభ్యులు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. బాధితురాలు ప్రియాంకకు అహియాపుర్​ గ్రామానికి చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండు లక్షల రూపాయల కట్నం కోసం అత్తింటివారు నిత్యం వేధిస్తుండేవారని ఆమె బంధువులు తెలిపారు. భర్త, అత్తింటివారు కలిసి ప్రియాంక, ఆమె రెండేళ్ల కూతురు కరిష్మ, ఎనిమిది నెలల బాబుకు విషం పెట్టి హత్య చేసినట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరకట్నం కోసం హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు పోలీసులు. సగం కాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: కండోమ్ లేకుండా సెక్స్.. 17లక్షల మందికి హెచ్​ఐవీ​.. ఆంధ్రప్రదేశ్​ టాప్!

చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని.. పాపం చిన్నారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.