ETV Bharat / bharat

మంత్రి సీడీ కేసులో కమిషనర్​కు చిక్కులు- దర్యాప్తునకు కోర్టు ఆదేశం

బెంగళూరు పోలీస్ కమిషనర్ సహా ఇతర అధికారులపై దర్యాప్తు జరపాలని కర్ణాటక కోర్టు ఆదేశించింది. భాజపా మాజీ మంత్రి సీడీ వ్యవహారం కేసులో వీరు ఎఫ్​ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని దాఖలైన పిటిషన్​ను విచారించి ఈ మేరకు తీర్పునిచ్చింది(karnataka minister cd case).

probe against Bengaluru police chief
బెంగళూరు పోలీస్​ కమిషనర్​పై విచారణకు ఆదేశం
author img

By

Published : Nov 25, 2021, 12:52 PM IST

భాజపా మాజీ మంత్రి సీడీ కేసు వ్యవహారంలో ఎఫ్​ఐఆర్​ నమోదు చేయనందుకు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్, డీసీపీ ఎంఎన్ అనుచెత్​, ఎస్​ఐ మారుతిపై దర్యాప్తు చేపట్టాలని కర్ణాటక కోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 లోగా నివేదిక సమర్పించాలని చెప్పింది. 8వ ఏసీఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది(karnataka minister cd case).

బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎఫ్​ఐఆర్​ నమోదు చేయకుండా ఆలస్యం చేసినందుకు పోలీసు అధికారులపై ఐపీసీ సెక్షన్​ 166కింద అభియోగాలు మోపి, దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది(karnataka cd case).

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళికి సంబంధించిన ఓ వీడియో సీడీ ఈ ఏడాది మొదట్లో తీవ్ర దుమారం రేపింది. అందులో ఓ మహిళతో ఆయన అభ్యంతరకరంగా ఉన్న దశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్​గా మారాయి. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనాధికారి సంఘర్ష పరిషత్​ ఉపాధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్​ పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఆర్టీఐ ఉద్యమకారుడు దినేశ్ కళ్లహళ్లి కూడా ఈ ఏడాది మార్చిలో ఫిర్యాదు చేశారు(ramesh jarkiholi cd).

సీనియర్ పోలీసు అధికారులు తమ విధులను క్రమశిక్షణతో నిర్వహించడంలో విఫలమయ్యారని, ఫిర్యాదుదారు కల్లహళ్లితో పాటు బాధితురాలిపై పక్షపాత ధోరణితో వ్యవహరించారని ఆదర్శ్ ఫిర్యాదులో పేర్కొన్నారు(Bengaluru police chief probe). శక్తిమంతమైన పాలక వర్గం ఒత్తిడికి తలొగ్గడం ద్వారా పోలీసులు అసమర్థతను ప్రదర్శించారని, దేశ చట్టాలను, భారత సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపించారు. సతంత్రంగా పనిచేసే పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చారని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కర్ణాటక కోర్టు పోలీసు ఉన్నతాధికారులు సహా ఎస్​ఐపై దర్యాప్తునకు ఆదేశించింది(ramesh jarkiholi cd case).

ఇవీ చదవండి: సీడీ కేసులో కొత్త ట్విస్ట్​.. నిజం ఒప్పుకున్న జార్ఖిహోళి!

సీడీ కేసులో కర్ణాటక మంత్రి రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.