ETV Bharat / bharat

సీడీ కేసు: హైకోర్టు సీజేకు మహిళ లేఖ! - కర్ణాటకమంత్రి వీడియో

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్​ జార్ఖిహోళితో పాటు అసభ్యకర వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ.. ఆ రాష్ట్ర హైకోర్టు సీజేకు లేఖ రాసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. జార్ఖిహోళి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచిన ఉందని పేర్కొంది. సీజే దగ్గరుండి దర్యాప్తును పర్యవేక్షించాలని కోరింది.

Sex candal: Woman writes to CJ of K'taka HC, alleges threat from Jarkiholi
సీడీ వ్యవహారం: కర్ణాటక హైకోర్టు సీజేకు మహిళ లేఖ!
author img

By

Published : Mar 29, 2021, 4:08 PM IST

కర్ణాటక మాజీమంత్రి రమేశ్​ జార్ఖిహోళి సీడీ వ్యవహారం.. తాజాగా మరో మలుపు తిరిగింది. దర్యాప్తును దగ్గరుండి పర్యవేక్షించాలని కోరుతూ.. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ అనధికారిక లేఖ వెళ్లింది. ఆ లేఖలోని అంశాల బట్టి.. వీడియోలో ఉన్నట్లు భావిస్తున్న మహిళ రాసినట్టుగా స్పష్టమవుతోంది.

తనకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కోర్టు గుర్తించి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆ మూడు పేజీల లేఖలో ఆ మహిళ పేర్కొంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది.

జార్ఖిహోళి, ప్రభుత్వం.. చెప్పినట్టుగా సిట్​ బృందం వ్యవహరిస్తోందని, అందువల్ల దర్యాప్తు సంస్థపై తనకు నమ్మకం పోయిందని లేఖలో మహిళ వివరించింది.

"జార్ఖిహోళి పెద్ద పేరు ఉన్న వ్యక్తి. ఆయన నన్ను బహిరంగంగానే బెదిరించారు. తనపై ఉన్న ఆరోపణలను తొలగించుకునేందుకు ఎంతదూరమైనా వెళతానని ఆయన అన్నారు. నాకు, నా కుటుంబసభ్యులకు జార్ఖిహోళి నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే చెప్పాను. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని.. నాకు రక్షణ కల్పించాలని కోరాను. కానీ జార్ఖిహోళి సిట్​ను ప్రభావితం చేసినట్టు తెలిసింది. ఆయన నన్ను ఎక్కడైనా చంపవచ్చు. ఆయనకున్న బలంతో ఆధారాలనూ తారుమారు చేయవచ్చు."

- లేఖలో మహిళ.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత సిద్దరామయ్య.. ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. లేఖలో పేర్కొన్న వివరాలు.. భయానకంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తోందా? అని ప్రశ్నించారు.

ఇదీ జరిగింది..

మాజీ మంత్రి రమేశ్.. ఓ మహిళతో అసభ్యకరమైన రీతిలో ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. అనంతరం దానిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. అయితే రమేశ్​తో వీడియోలో ఉన్నట్లుగా భావిస్తున్న మహిళ.. సీడీలో ఉన్నది తాను కాదని అనేక వీడియోలు, ఆడియోలు విడుదల చేసింది.

ఇదీ చూడండి:- కర్ణాటక సీడీ కేసులో వరుస ట్విస్ట్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.