ETV Bharat / bharat

ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలోని ఐదుగురు దుర్మరణం.. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి..

ఈత కొట్టేందుకు కాలువ దగ్గరకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం కర్ణాటకలోని దొడ్డకెట్టెగెరె గ్రామంలో జరిగింది.

Several Children drowned in water and died in Karnataka, UP, West Bengal
యూపీ, కర్ణాటక, బంగాల్​లో చెరువులో పడి మరణించిన అనేక మంది చిన్నారులు
author img

By

Published : Apr 25, 2023, 6:02 PM IST

Updated : Apr 25, 2023, 7:14 PM IST

కర్ణాటకలోని మండ్య తాలూకా దొడ్డకెట్టెగెరె గ్రామంలో విషాదం జరిగింది. వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు.. విశ్వేశ్వరయ్య అనే కాలువలో ఈత కోసం వెళ్లి అందులో పడి దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులతోపాటు ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బెంగళూరులో నివాసం ఉండే ఓ కుటుంబం వేసవి సెలవులకని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఓ కాలువ వద్దకు ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ముందుగా ఓ బాలుడు నీటిలో జారి పడ్డాడు. అతడిని కాపాడే యత్నంలో మిగిలిన నలుగురు కాలువలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

చిన్నవయసులోనే..
ఈ ఘటనపై బాసరలు పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు గ్రామస్థులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. మృతులు అనీషా బేగం(10), తస్మియా(22), మెహతాబ్(10), అష్రక్(28), అఫికా(22)గా గుర్తించారు పోలీసులు. వీరిలో అష్రక్, అఫికాల మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సి ఉంది. ఇంత చిన్న వయసులోనే పిల్లలు మృత్యుఒడికి చేరడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతులందరూ బెంగళూరులోని నీలసంద్ర ప్రాంతానికి చెందినవారు.

మేనమామ ఇంటికి వచ్చి.. ప్రాణాలు విడిచి..
బంగాల్​ రాష్ట్రం ఝర్‌గ్రామ్‌లోని అరదంగ్రి ఘాట్ ప్రాంతంలో ఇద్దరు సోదరులు స్నానం కోసమని వెళ్లి ప్రమాదవశాత్తు సుబర్ణరేఖ అనే నదిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతులు దేబబ్రత షా(17), చందన్ షా(15)గా గుర్తించారు పోలీసులు. శుకమ్రాసోల్ గ్రామానికి చెందిన దేబబ్రత షా ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఖరీకాషోలేలోని తన మేనమామ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నదిలో స్నానం చేసేందుకు తన మామ కొడుకు చందన్‌ను తోడుగా తీసుకెళ్లాడు. ఎంతసేపటికి పిల్లలు ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు వెతుకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారికి నదిలో రెండు మృతదేహాలు తేలియాడుతుండడం గమనించారు. వెంటనే వారిని ఒడ్డుకు చేర్చి గోపీబల్లవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే వారు మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

చెరువులో అక్కాచెళ్లెల్లు..
ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్‌పూర్‌లోని వాసుపూర్ గ్రామంలో ఇద్దరు అక్కాచెళ్లెల్లు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి దగ్గర్లోని ఓ చెరువులో పడి మరణించారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం జరిగింది. కాగా, మృతి చెందిన చిన్నారులు శ్రీయాన్షి(5), ప్రియాన్షి(3)గా గుర్తించారు గోసాయిగంజ్​ పోలీసులు.

Last Updated : Apr 25, 2023, 7:14 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.