ETV Bharat / bharat

పెళ్లి వేడుకలో ఘోరం... బావిలో పడి 13 మంది మహిళలు మృతి - ఉత్తర్​ప్రదేశ్ హల్దీ వేడుకలో 11 మంది మృతి

उत्तर प्रदेश के कुशीनगर में बुधवार देर शाम बड़ा हादसा हो गया. बताया जा रहा है कि शादी समारोह में हल्दी रस्म के दौरान कई लड़कियां और महिलाएं कुएं में गिर गईं. इनमें से बच्चियों समेत 11 लोगों की मौके पर मौत हो गई. जबकि दो लोग गंभीर रूप से घायल हो गए. यूपी के सीएम योगी आदित्यनाथ ने भी घटना पर गहरा शोक जताया है.

11 people died in kushinagar
11 people died in kushinagar
author img

By

Published : Feb 17, 2022, 6:46 AM IST

Updated : Feb 17, 2022, 8:24 AM IST

06:40 February 17

పెళ్లి వేడుకలో ఘోరం... బావిలో పడి 13 మంది మహిళలు మృతి

బావి వద్ద సహాయక చర్యలు

people died falling in well: ఉత్తర్​ప్రదేశ్ ఖుషీనగర్​లో ఘోరం జరిగింది. బావిలో పడి 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వివాహానికి ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

పరేమేశ్వర్ కుష్వాహా అనే వ్యక్తికి సంబంధించిన వివాహ వేడుక నెబువా నౌరాంగియాలో నిర్వహించారు. హల్దీ కార్యక్రమానికి భారీగా అతిథులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 50-60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు. ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కొంతమంది నిల్చున్నారు. అయితే, దురదృష్టవశాత్తు కంచె విరిగిపోవడం వల్ల.. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి.. వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో 13 మంది మరణించారని వైద్యులు నిర్ధరించారు.

రూ.4లక్షల పరిహారం

ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. వారికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. జిల్లా అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

మరోవైపు, ప్రధాని సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తన హృదయాన్ని కలచివేసిందన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 'క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. స్థానియ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైంది' అని ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: భాజపా కార్యాలయంలోనే హెడ్​కానిస్టేబుల్​​ ఆత్మహత్య

Last Updated : Feb 17, 2022, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.