ETV Bharat / bharat

బాణసంచా నిల్వ ఉన్న ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం - namakkal crackers blast tragedy

బాణసంచా నిల్వ ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులో జరిగిందీ ఘటన.

Four killed in firecracker
Four killed in firecracker
author img

By

Published : Dec 31, 2022, 11:11 AM IST

Updated : Dec 31, 2022, 2:31 PM IST

తమిళనాడులోని నమక్కల్​ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా నిల్వ ఉన్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మెహనూర్​కు చెందిన తిల్లై కుమార్​(37).. స్థానికంగా బాణాసంచా వ్యాపారం చేస్తున్నాడు. అతడు లైసెన్స్​ కూడా కలిగి ఉన్నాడు. తిల్లై కుమార్​.. తన ఇంట్లోనే బాణసంచాను నిల్వ ఉంచాడు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇంట్లో ఉన్న తిల్లై కుమార్​, అతడి తల్లి, భార్య ప్రియ అక్కడికక్కడే మరణించారు. అతడి కుమార్తె మాత్రం ప్రాణాలతో బయటపడింది.

పేలుడు ధాటికి తిల్లై కుమార్​ ఇల్లు కూడా ధ్వంసమైంది. చుట్టుపక్క ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ప్రభావంతో పొరిగింట్లో ఉండే 70 ఏళ్ల వృద్ధురాలు కూడా మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఘటనకు షార్ట్​-సర్క్యూట్​ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Dec 31, 2022, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.