ETV Bharat / bharat

9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంప్​కు.. ఏడేళ్ల బాలిక సాహసం! - ఎవరెస్ట్​ బేస్ క్యాంపును అధిరోహించిన బాలిక

ఏడేళ్ల బాలిక.. ఎవరెస్టు శిఖరం బేస్​ క్యాంప్​కు చేరుకుని అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తన ఎవరెస్టు ప్రయాణం ఎలా సాగింది.

7 years old girl reach mount everest
ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై జెండా ఎగుర వేసిన సాన్వీ సూద్
author img

By

Published : Jun 11, 2022, 3:02 PM IST

పంజాబ్​లోని రోపర్‌కు చెందిన సాన్వీ సూద్ అనే ఓ ఏడేళ్ల బాలిక చరిత్ర సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంపునకు చేరుకుంది. ఆ ప్రాంతానికి చేరుకున్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్​ నెలకొల్పి అందరి మన్ననలు పొందుతోంది. 65 కిలోమీటర్ల ట్రాక్​లో ఎన్ని అవాంతరాలు ఎదురైన.. బెదరక బేస్​ క్యాంప్​కు చేరుకుని.. అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. విపరీతమైన చలి, బలమైన గాలులను సైతం తట్టుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందినా తన ఎవరెస్ట్ ప్రయాణంలో ఎక్కడా బెదరలేదు.

7 years old girl reach mount everest
ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై జెండా ఎగుర వేసిన సాన్వీ సూద్

సాన్వీ సూద్​.. మొహలీలోని యాదవీంద్ర స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. ఎవరెస్టుపై 5,364 మీటర్ల ఎత్తులోని బేస్​ క్యాంప్​లో ఒక రోజు నివసించాలని బలంకా సంకల్పించుకుంది. అందుకు తగినట్లుగా సన్నద్ధమైన తన ప్రయాణాన్ని సాగించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే అక్కడికి చేరుకుని ఔరా అనిపించింది. సాన్వీ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తన గమ్యస్థానాన్ని చేరుకున్న సాన్వీని అభినందిస్తున్నారు.

7 years old girl reach mount everest
ఎవరెస్ట్​ బేస్ క్యాంపును అధిరోహిస్తున్న బాలిక

ఇవీ చదవండి: ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో ప్రేమ​.. ఇద్దరు బిడ్డలు పుట్టాక ఒకే వేదికపై పెళ్లి

మండుటెండలో చెట్టు నుంచి వర్షం.. అమ్మవారి మహిమే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.