ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఏడుగురు ఉగ్ర అనుచరులు అరెస్టు

author img

By

Published : May 27, 2021, 11:25 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. సీఆర్​పీఎఫ్​ జవాన్లతో కలిసి జరిపిన దాడుల్లో.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ముఠాను అరెస్టు చేశారు.

Seven militant associates arrested from south Kashmir : Police
జమ్ముకశ్మీర్​లో ఉగ్ర సహచరులు అరెస్టు

జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరాలో ఏడుగురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారంతా జైష్​-ఎ-మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందినవారని తెలిపారు. సీఆర్​పీఎఫ్​తో కలిసి ఈ దాడులు నిర్వహించారు పోలీసులు. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలో చేరేందుకు యత్నించిన మరో ఆరుగురిని కూడా అడ్డుకున్నట్లు వెల్లడించారు.

పాకిస్థాన్​కు చెందిన కొందరు కమాండర్లు ఈ యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదులుగా మారేలా ప్రేరేపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాంతో పాటే అవంతిపొరా, త్రాల్​లోని క్షేత్రస్థాయి ముష్కరుల​తో సంబంధం ఏర్పరచుకునేలా ప్రోత్సాహించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం- 10 కిలోల ఐఈడీ స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.