మక్కల్ నీధి మయ్యం(ఎంఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్‌కు షాకిచ్చారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం. కమల్ రెండో దశ ప్రచారం కార్యక్రమంలో ఉండగా.. అరుణాచలం పార్టీని వీడి, భాజపాలో చేరారు. చెన్నైలోని భాజపా కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు అరుణాచలం.
"రైతులకు ఉపయోగకరంగా ఉన్నందున సాగు చట్టాలు మద్దతివ్వాలని కమల్‌ను కోరాను. అయితే వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని వ్యతిరేకిస్తున్నారు" అని విమర్శించారు అరుణాచలం.
ఇదీ చూడండి: కళగమ్ పార్టీలతో పొత్తు ఉండదు: కమల్