ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో హై అలర్ట్.. కారణమిదే!

author img

By

Published : Jun 13, 2021, 2:03 PM IST

Updated : Jun 13, 2021, 3:07 PM IST

శ్రీలంక నుంచి అక్రమచొరబాట్లు జరుగుతాయన్న కేంద్రం సమాచారం మేరకు తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్​ ప్రకటించారు. పోలీసు బలగాలను మోహరించారు.

high alert in TN
రాష్ట్రంలో హై అలర్ట్

శ్రీలంక నుంచి భారీ ఆయుధాలతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లు జరుగుతాయన్న కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించి పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసింది.

భారీ ఆయుధాలతో ఓ నౌక.. రామేశ్వరం వైపు వస్తోందని అధికారులకు సమాచారం అందింది. ఫలితంగా రాష్ట్రంలోని కన్యాకుమారి, తూత్తుకూడి, రామేశ్వరం, చెన్నైలోని తీర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో కేరళ కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : అన్​లాక్​కు గ్రీన్​ సిగ్నల్​- మాల్స్​, మార్కెట్లు ఓపెన్​

Last Updated : Jun 13, 2021, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.