అనుమతి లేకుండా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దర్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోర్టు వీరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సోమవారం రాత్రి 9.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు వివరించారు అధికారులు. 'మద్యం మత్తులో ఓ వ్యక్తి, అతని స్నేహితురాలు.. అనుమతి లేకుండా రాష్ట్రపతి భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశాం." అని పోలీసులు తెలిపారు.
నిందితులను శివం శర్మ, కుసుమ్ రాజ్‌పుత్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే ఓ సెలూన్లో పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: హైదర్పొరా ఎన్కౌంటర్పై కశ్మీర్లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు