ETV Bharat / bharat

దిల్లీ ఎయిర్​పోర్ట్​కు బాంబు బెదిరింపు- హైఅలర్ట్

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్​ఖైదా ఉగ్రవాదులు బాంబు దాడికి పథక రచన చేసినట్లు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎయిర్​పోర్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్.. విమానాశ్రయాన్ని పూర్తిగా జల్లెడ పట్టింది. చివరకు, ఈ బెదిరింపులు అవాస్తవమని అధికారులు నిర్ధరణకు వచ్చారు.

Security increased at Delhi's IGI airport after threat email
దిల్లీ ఎయిర్​పోర్ట్​కు బాంబు బెదిరింపులు
author img

By

Published : Aug 8, 2021, 12:02 PM IST

దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ(ఐజీఐ) విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్​పోర్ట్​పై అల్​ఖైదా ఉగ్రవాదులు దాడికి పన్నాగం పన్నారని దిల్లీ పోలీసులకు ఈమెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని టెర్మినళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఏఓఆర్ పెట్రోలింగ్​ను ముమ్మరం చేశారు.

అయితే, ఈ బెదిరింపులు అవాస్తవమని విచారణలో తేలినట్లు ఐజీఐ ఏయిర్​పోర్ట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాంబు స్క్వాడ్ ఎయిర్​పోర్ట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. అయినా.. అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

"అల్​ఖైదా ఉగ్రవాదులు ఎయిర్​పోర్ట్​లో బాంబు దాడికి ప్రణాళికలు రచిస్తున్నారని ఐజీఐ పోలీస్ స్టేషన్ ఎయిర్​లైన్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్​కు శనివారం సమాచారం ఇచ్చింది. కరణ్​బిర్ సూరి అలియాస్ మహమ్మద్ జలాల్, అతడి భార్య షేలీ శార్దా అలియాస్ హసీనా సింగపూర్ నుంచి భారత్​కు ఆదివారం వస్తున్నారని అందులో పేర్కొన్నారు. 1-3 రోజుల్లో బాంబు దాడి చేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులు అవాస్తవమని రాత్రి 7.18 గంటలకు నిర్ధరణకు వచ్చాం."

-ఐజీఐ ఎయిర్​పోర్ట్ ప్రకటన

అయితే, ఇదే జంట పేర్లతో మరికొన్ని బెదిరింపులు ఇటీవల వచ్చినట్లు ఎస్ఓసీసీ అధికారులు గుర్తించారు. జాగ్రత్తగా ఉండాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా దిల్లీ పోలీసులను ఐజీఐ విమానాశ్రయం కోరింది.

ఇదీ చదవండి: అమితాబ్‌ నివాసానికి బాంబు బెదిరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.