ETV Bharat / bharat

డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇక ఆ ఆయుధాలు! - భద్రతా బలగాలు చేతుల్లో పీఏజీలు

డ్రోన్​ దాడులను(Drone Attack) ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు.. కీలక నిర్ణయం తీసుకున్నాయి. తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను(Drone Attack) నేలకూల్చడానికి ప్రాణాంతకం కాని పంప్ యాక్షన్ గన్​లను ఇకపై వినియోగించనున్నాయి.

drone attack news
డ్రోన్​ దాడిని ఎదుర్కొనేందుకు పీఏజీల వినియోగం
author img

By

Published : Sep 19, 2021, 7:33 PM IST

ఇటీవల కాలంలో ఉగ్రమూకలు.. డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఘటనలు(Drone Attack) పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా దాడులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు(indian security forces) కీలక చర్యలు చేపట్టాయి. డ్రోన్లను నేల మట్టం చేయడానికి.. ప్రాణాంతకం కాని ఆయుధాలైన పంప్ యాక్షన్ గన్​(పీఏజీ)లను వినియోగించేందుకు సిద్ధమయ్యాయి. డ్రోన్​ దాడులను(Drone Attack) ఎదుర్కోవడానికి పటిష్ఠమైన సాంకేతికత అందుబాటులోకి వచ్చే వరకు ఈ పీఏజీలను వినియోగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

తక్కువ ఎత్తులో తిరిగే వాటికోసం..

సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)లో.. డ్రోన్ దాడులను(Drone Attack) ఎదుర్కోవడానికి లైట్ మెషీన్​​ గన్​(ఎల్​ఎమ్​జీ)ని సిబ్బంది వినియోగిస్తున్నారు. దీని ద్వారా.. 360 డిగ్రీల్లో పహారా కాస్తూ, అధిక ఎత్తులో తిరిగే మానవ రహిత వైమానిక వాహనాలను నేలకూల్చవచ్చు. అయితే.. తాజాగా కేంద్ర భద్రతా దళాలు రూపొందించిన ఓ బ్లూ ప్రింట్ ప్రకారం.. తక్కువ ఎత్తులో తిరిగే డ్రోన్లను నేలకూల్చేందుకు పీఏజీలను వినియోగించాల్సిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఈ ఆదేశాల ప్రకారం వివిధ ఘర్షణాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే.. పీఏజీలను తరలించినట్లు తెలుస్తోంది.

"డ్రోన్ల దాడిని ఎదుర్కొనేందుకు సమర్థమైన సాంకేతికత తయారు చేసేవరకు.. భద్రతా సిబ్బందిని వారి వద్ద ఉన్న పీఏజీలను వినియోగించాలని ఆదేశించాం. ఈ తరహా ఆయుధాలు ఎక్కువ సంఖ్యలో లేకపోతే వాటిని సమకూర్చుకోవాలని చెప్పాం" అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. కశ్మీర్​లో ఉగ్రవాద వ్యతిరేక విధులు నిర్వహిస్తున్నవారికి, విమానాశ్రయాల్లో పహారా కాస్తున్న సిబ్బందికి ఈ పీఏజీలను వినియోగించాలని చెప్పామని తెలిపారు.

తక్కువ నష్టంతో..

భూమిపై 60 నుంచి 100 మీటర్ల ఎత్తులో సంచరించే డ్రోన్లను(Drone Attack) పీఏజీల ద్వారా వచ్చే రబ్బర్ పెల్లెట్లు.. సమర్థంగా నేలకూల్చగలవని సెంట్రల్ ఆర్మ్​డ్ ఫోర్సెస్​కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఐఎన్​ఎస్​ఏస్​ రైఫిల్​ వంటి ప్రాణాంతక ఆయుధాలు వినియోగిస్తే.. గాయాలు కావడం సహా మౌలిక వసతులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ పీఏజీల వినియోగం వల్ల అలాంటి నష్టం వాటిల్లకుండా డ్రోన్​ దాడులను ఎదుర్కోవచ్చని చెప్పారు.

జమ్ములోని ఐఏఎఫ్​ స్థావరంపై జూన్​ 27న జరిగిన డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడగా ఓ భవనం ధ్వంసమైంది. ఆ తరవాత కూడా వివిధ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయి.

ఇదీ చూడండి: Ind Pak border: సరిహద్దులో మళ్లీ పాక్​ డ్రోన్ల కలకలం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.