ETV Bharat / bharat

ఉత్తర కశ్మీర్​లో చొరబాటుదారుడు హతం

జమ్ము కశ్మీర్​లో ఉరీ ప్రాంతంలో ఓ చొరబాటుదారుడిని భద్రతా బలగాలు హతమార్చాయి. మృతుడిని సర్ఫరాజ్​ మిర్​గా అధికారులు గుర్తించారు. ఓ రైఫిల్​ సహా పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో నివాసిగా పేర్కొన్న గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు.

jammu infiltration
ఉత్తర కశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం
author img

By

Published : Feb 10, 2021, 3:12 PM IST

ఉత్తర కశ్మీర్​లోని బారాముల్లా జిల్లా దులాంజా గ్రామంలో సైన్యం ఓ చొరబాటుదారుడిని మట్టుబెట్టింది. మృతుడిని కుండిబర్జాలా కమాల్కోట్​ గ్రామానికి చెందిన సర్ఫరాజ్​ మిర్(56)​గా అధికారులు గుర్తించారు. మిర్​.. ​మంగళవారం రాత్రి పాకిస్థాన్​ నుంచి భారత భూభాగంలోకి చొరబడుతున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

పాక్​కు వెళ్లి.. తిరిగి వస్తూ...

1990లో తొలిసారి సరిహద్దు దాటి​ పాక్​కు వెళ్లిన మిర్ ఆ తర్వాత​ 1995లో భారత బలగాలకు లొంగిపోయాడని అధికారులు వెల్లడించారు. మళ్లీ 2005లో పాకిస్థాన్​కు తిరిగి వెళ్లాడని పేర్కొన్నారు. మృతుడి నుంచి ఒక రైఫిల్​ సహా పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ముజఫరాబాద్​​ నివాసిగా పేర్కొంటూ ఉన్న గుర్తింపు కార్డును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి : 'పెట్రోల్​ ధరల పెరుగుదలకు అదే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.