ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఈ నెల14 నుంచి 144 సెక్షన్ - maharashtra 144 section

maharashtra lockdown
మహారాష్ట్ర లాక్​డౌన్
author img

By

Published : Apr 13, 2021, 9:00 PM IST

Updated : Apr 13, 2021, 9:21 PM IST

20:44 April 13

కఠిన ఆంక్షలు విధిస్తూ ఠాక్రే నిర్ణయం

మహారాష్ట్రలో బుధవారం రాత్రి 8 గంటల నుంచి మరిన్ని ఆంక్షలు అమలులోకి వస్తాయని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 14 నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని వివరించారు. దీన్ని లాక్​డౌన్​గా పేర్కొనని చెప్పారు.

కరోనా కారణంగా వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఆక్సిజన్, పడకల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. రెమిడెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరిగిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్​ను తీసుకొచ్చేందుకు వాయుసేన సహకారం కావాలని ప్రధానిని కోరనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్​డౌన్ ఉంటుందని ఇటీవల అనేక ఊహాగానాలు వచ్చాయి. మంగళవారం రాత్రి ప్రజలనుద్దేశించి ఉద్ధవ్ చేసే ప్రసంగంలో ఈ ప్రకటనే ఉంటుందని భావించారు. అయితే మహా సీఎం మాత్రం లాక్​డౌన్​ కాకుండా కఠిన ఆంక్షలవైపే మొగ్గు చూపారు.

Last Updated : Apr 13, 2021, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.