ETV Bharat / bharat

'టైం క్యాప్సుల్'​లో ఏఎంయూ చరిత్ర భద్రం

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయ(ఏఎంయూ) చరిత్రను ప్రతిబింబించే 100ఏళ్ల నాటి దస్త్రాలను టైమ్​ క్యాప్సుల్​ ద్వారా భూమిలో భద్రపరిచారు. ఏఎంయూలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో భాగంగా వీటిని భూమికి 30అడుగుల లోతులో భద్రపరిచారు.

author img

By

Published : Jan 26, 2021, 6:55 PM IST

up_ali_04_time_capsule_buried_on_republic_day_vis_byte_7203577
టైం క్యాప్సుల్​లో ఏఎంయూ చరిత్ర భద్రం

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయ(ఏఎంయూ) చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో 'టైమ్​ క్యాప్సుల్'​ను ఏర్పాటు చేశారు. సుమారు 1.5 టన్నుల బరువున్న ఈ స్టీల్ క్యాప్సూల్​ను విక్టోరియా గేట్ ఎదురుగా.. 30 అడుగుల లోతులో భద్రపరిచారు. ఆన్​లైన్​లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనేక రచనలు..

టైమ్ క్యాప్సూల్​లో 100 సంవత్సరాల చరిత్రను వివరించే చారిత్రక పత్రాలు, సమావేశాల సంక్షిప్త సమాచారం, ఇతర దస్త్రాలను భద్రపరిచారు. అలాగే.. 1920లో ఆమోదించిన ఏఎంయూ చట్టం.. ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఖాలిక్ అహ్మద్ నిజామి రచనలు సహా అనేకం ఉన్నాయి.

ఏఎంయూ చరిత్రను భవిష్యత్ తరాలకు అందిచాల్సిన అవసరం ఉంది. చరిత్రాత్మక పత్రాల సంరక్షణ కీలకమైన అంశం.

-ప్రొఫెసర్​ తారిఖ్​ మన్సూర్, ఏఎంయూ వీసీ.

ఎస్.కె. భట్నాగర్ రాసిన 'హిస్టరీ ఆఫ్ మావో కాలేజీ', అల్తాఫ్ హుస్సేన్ హాలీ రచించిన 'హయతే జావేద్', ప్రొఫెసర్ షాన్ మొహమాద్ రాసిన 'ది గ్లింప్సెస్ ఆఫ్ ముస్లిం ఎడ్యుకేషన్' వంటి అరుదైన పుస్తకాలను ఇందులో భద్రపరిచారు.

1877లో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల(ఎంఏఓ) స్థాపన సమయంలో ఖననం చేసిన టైమ్ క్యాప్సూల్​ను వెలికి తీయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: 'స్వావలంబన భారత్​కు అంకితం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.